- Home
- Sports
- Cricket
- సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ చేసి 11 ఏళ్లు... విరాట్ కోహ్లీ ఆ 25 అడుగుల దూరాన్ని దాటగలడా?...
సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ చేసి 11 ఏళ్లు... విరాట్ కోహ్లీ ఆ 25 అడుగుల దూరాన్ని దాటగలడా?...
క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ నమోదు చేసిన రికార్డుల గురించి రాయాలంటే ఓ పుస్తకం సరిపోదు, వాల్యూమ్ 1, 2, 3 అంటూ ఓ పెద్ద గ్రంథమే రాయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు సచిన్ టెండూల్కర్...

ఏడాదిలో 365 రోజులు ఉంటే, ప్రతీ రోజు సచిన్ టెండూల్కర్ ఏదో ఓ రికార్డు సాధించాడు. అయితే మార్చి 16తో మాస్టర్‌కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మార్చి 16న సచిన్ టెండూల్కర్, ఏకంగా ఒకటికి మూడు అరుదైన రికార్డులను క్రియేట్ చేశాడు...
పాకిస్తాన్‌పై భారత క్రికెటర్లు చాలామంది సెంచరీలు చేశారు. అయితే పాకిస్తాన్‌లో, పాకిస్తాన్‌పై వన్డే సెంచరీ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు సచిన్ టెండూల్కర్. 2014, మార్చి 16న పాక్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 141 పరుగులు చేసి చరిత్ర లిఖించాడు సచిన్ టెండూల్కర్...
135 బంతుల్లో 17 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 141 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, టీమిండియా తరుపున ఒంటరి పోరాటం చేశాడు. రాహుల్ ద్రావిడ్ 36, వీరేంద్ర సెహ్వాగ్ 26, యువరాజ్ సింగ్ 19, రమేశ్ పవార్ 18, సౌరవ్ గంగూలీ 15 పరుగులు చేయగా మహ్మద్ కైఫ్ 7, వీవీఎస్ లక్ష్మణ్ 4 పరుగులు చేశారు. ఫలితం 330 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా 12 పరుగుల తేడాతో ఓడింది. సచిన్ టెండూల్కర్ తర్వాత ఎక్స్‌ట్రాల రూపంలో టీమిండియాకి 37 పరుగులు రాగా, భారత బ్యాటర్లలో ఎవ్వరూ ఎక్స్‌ట్రాల ద్వారా వచ్చిన పరుగులను కూడా అందుకోలేకపోయారు...
ఈ సెంచరీతో వన్డేల్లో 13 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు సచిన్ టెండూల్కర్. 2005, మార్చి 16న టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు మాస్టర్. టీమిండియా తరుపున సునీల్ గవాస్కర్ తర్వాత టెస్టుల్లో 10 వేల పరుగులు అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు...
2012, మార్చి 16న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ కెరీర్‌లో 100వ సెంచరీ అందుకున్నాడు సచిన్ టెండూల్కర్. ఆసియా కప్ 2012 టోర్నీలో భాగంగా బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో 147 బంతుల్లో12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 114 పరుగులు చేశాడు సచిన్ టెండూల్కర్...
విరాట్ కోహ్లీ 66, సురేష్ రైనా 51 పరుగులు చేసి అవుట్ కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 289 పరుగులు చేసింది ఈ లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 4 బంతులు మిగిలి ఉండగానే చేధించింది బంగ్లాదేశ్...
వన్డేల్లో 49 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్, టెస్టుల్లో 51 శతకాలు బాదాడు. వన్డేల్లో 46 సెంచరీల మార్కుని అందుకున్న విరాట్ కోహ్లీ, సచిన్ రికార్డుకు 3 సెంచరీల దూరంలో ఉన్నాడు. అలాగే టెస్టుల్లో 28 సెంచరీలు అందుకున్న విరాట్, మొత్తంగా 75 అంతర్జాతీయ సెంచరీలతో సచిన్ తర్వాతి ప్లేస్‌లో ఉన్నాడు...
టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ రికార్డును అందుకోవడం విరాట్‌కి చాలా కష్టమైన పని. అయితే వన్డేల్లో 50 సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచేందుకు విరాట్ మరో 4 సెంచరీలు చేస్తే చాలు...
సచిన్ టెండూల్కర్‌ని అందుకోవాలంటే విరాట్ కోహ్లీ మరో 25 అడుగులు వేయాలి. ఇంతకుముందులా ఏడాది 5 సెంచరీలు చేసినా, 25 సెంచరీలు చేసేందుకు ఐదేళ్లు పడుతుంది. ఇప్పటికే 34 ఏళ్లు దాటేసిన విరాట్ కోహ్లీ, 39-40 ఏళ్ల వరకూ కొనసాగితే కానీ అది సాధ్యం కాదు.. అయినా 100 సెంచరీలు అందుకోవడం అంటే విరాట్, మునుపటి రేంజ్‌లో పరుగులు చేయాల్సి ఉంటుంది...
sachin kohli
విరాట్ కోహ్లీ కెరీర్‌లో మూడేళ్ల గ్యాప్ లేకపోయి ఉంటే సచిన్ టెండూల్కర్ రికార్డును చేరవయ్యేవాడు. అయితే కరోనా లాక్‌డౌన్ తర్వాత వచ్చిన గ్యాప్‌ని పూర్తి చేయడం అయ్యే పని కాదు. వచ్చే మూడు నాలుగేళ్లు విరాట్ ఎంత బాగా ఆడినా 85- 90 సెంచరీలను దాటి ముందుకెళ్లడం కష్టమే..