సిరాజ్ నీ బౌలింగ్ సూపర్... తీసింది ఒకే వికెట్ అయినా... సచిన్ టెండూల్కర్ ప్రశంస...
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు తండ్రిని కోల్పోయిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్... టెస్టు సిరీస్‌లో అద్బుతంగా రాణిస్తున్నాడు. రెండో టెస్టులో బుమ్రా, ఉమేశ్ యాదవ్‌లతో కలిసి మూడో పేసర్‌గా ఎంట్రీ ఇచ్చిన సిరాజ్... మూడో టెస్టులో బుమ్రాతో కలిసి ఓపెనింగ్ స్పెల్‌లో భాగం పంచుకున్నాడు. ఆఖరి టెస్టులో సీనియర్ పేసర్‌గా బౌలింగ్ విభాగాన్ని నడిపాడు.

కెరీర్‌లో మూడో టెస్టు ఆడుతున్నప్పటికీ యంగ్ బౌలర్లకు మార్గనిర్దేశకం చేస్తూ, అద్భుతంగా రాణించిన సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.

మొదటి ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్‌లోనే డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేసిన మహ్మద్ సిరాజ్... ఆ తర్వాత వికెట్లు తీయలేకపోయాడు...

‘గబ్బా పిచ్‌పై బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు... భారతీయ బౌలర్‌కి ఇది మరింత కఠినమైన పిచ్... కానీ సిరాజ్ పిచ్‌పై పగుళ్లను అద్భుతంగా వాడుకున్నాడు...

బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడు... అతని బౌలింగ్‌ను నేను ఎంతగానో గమనించి చూశాను... బంతి బంతికీ వైవిధ్యం చూపిస్తూ ఎంతో తెలివిగా బౌలింగ్ చేస్తున్నాడు...

ఫస్ట్ స్లిప్, సెకండ్ స్లిప్ లక్ష్యంగా సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు... అతని బౌలింగ్ నిజంగా అద్భుతంగా ఉంది...

బంతి కోణాన్ని మార్చి కట్టర్ బంతులు వేస్తున్నాడు... సిరాజ్‌లో చాలా టాలెంట్ ఉంది... అతనికి దక్కింది ఒకే వికెట్ అయినా...

ఆసీస్‌ను తన బౌలింగ్‌తో కట్టిడి చేశాడు సిరాజ్’ అంటూ చెప్పుకొచ్చాడు సచిన్ టెండూల్కర్.

మొదటి ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లు బౌలింగ్ చేసిన మహ్మద్ సిరాజ్... 10 మెయిడిన్లు వేశాడు...