వారి కోసం గూగ్లీలు దాచి పెట్టు, ధనుశ్రీపైన వాడకు... చాహాల్‌కి రోహిత్ విషెస్...
First Published Dec 23, 2020, 3:31 PM IST
బక్కపలుచని పర్సనాలిటీతో చూడగానే నవ్వులు తెప్పించే యజ్వేంద్ర చాహాల్, తన యాటిట్యూడ్‌తో మరింత సరదాగా ఉంటాడు. ‘చాహాల్ టీవీ’ ఫన్నీ ఇంటర్వ్యూలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యజ్వేంద్ర చాహాల్, తన ప్రియురాలి ధనుశ్రీ వర్మను నిన్న పెళ్లాడాడు. కుటుంబసభ్యుల నడుమ జరిగిన ఈ వివాహ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు యజ్వేంద్ర చాహాల్.

యూట్యూబర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ధనుశ్రీ వర్మను పెళ్లాడిన యజ్వేంద్ర చాహాల్... సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశాడు...

భారత క్రికెటర్ రోహిత్ శర్మ, యజ్వేంద్ర చాహాల్‌కు విషెస్ తెలిపాడు... ‘కంగ్రాట్స్ బ్రో... మీ ఇద్దరికీ బెస్ట్ విషెస్... ఆ గూగ్లీలను ప్రత్యర్థుల కోసం దాచి పెట్టు... ఆమెపై వాడకు’ అంటూ కొంటెగా ట్వీట్ చేశాడు రోహిత్ శర్మ.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?