యువీ రికార్డును బద్దలుకొట్టిన హిట్‌మ్యాన్.. గేల్ తర్వాత టీమిండియా సారథే..
నెదర్లాండ్స్‌తో మ్యాచ్ లో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. తన మాజీ సహచరుడు, హిట్ మ్యాన్ క్లోజ్ ఫ్రెండ్ యువరాజ్ సింగ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్ గా ఉన్న యువీని పక్కకునెట్టిన హిట్ మ్యాన్.. ఆ స్థానాన్ని ఆక్రమించాడు.
Image credit: Getty
నెదర్లాండ్స్‌తో మ్యాచ్ లో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. తన మాజీ సహచరుడు, హిట్ మ్యాన్ క్లోజ్ ఫ్రెండ్ యువరాజ్ సింగ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్ గా ఉన్న యువీని పక్కకునెట్టిన హిట్ మ్యాన్.. ఆ స్థానాన్ని ఆక్రమించాడు.
నెదర్లాండ్స్ తో మ్యాచ్ కు ముందు వరకు ఐసీసీ టీ20 ప్రపంచకప్ లలో భారత జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు యువరాజ్ పేరిట ఉండేది. యువీ.. ఈ మెగా టోర్నీలలో మొత్తంగా 33 సిక్సర్లు బాదాడు. కానీ ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో హిట్ మ్యాన్ 3 సిక్సర్లు బాదాడు. దీంతో పొట్టి ప్రపంచకప్ లో రోహిత్ సిక్సర్ల సంఖ్య 34కు చేరింది. ఈ జాబితాలో భారత్ నుంచి రోహిత్ శర్మ (34), యువరాజ్ సింగ్ (33) తర్వాత విరాట్ కోహ్లీ (24) ఉన్నాడు.
అంతర్జాతీయంగా చూసుకుంటే ఈ జాబితాలో విండీస్ వీరుడు క్రిస్ గేల్ ముందున్నాడు. గేల్.. టీ20 ప్రపంచకప్ టోర్నీలలో మొత్తంగా 63 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత రెండో స్థానం రోహిత్ శర్మ (34) దే కావడం గమనార్హం.
ఈ జాబితాలో గేల్, రోహిత్ తర్వాత యువరాజ్ సింగ్ (33), డేవిడ్ వార్నర్ (31), షేన్ వాట్సన్ (31), ఏబీ డివిలియర్స్ (30), జోస్ బట్లర్ (26), డ్వేన్ బ్రావో (25) లు ఉన్నారు.
అత్యధిక సిక్సర్ల రికార్డుతో పాటు రోహిత్ మరో రికార్డు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ లో 53 పరుగులు చేయడం ద్వారా రోహిత్.. టీ20 ప్రపంచకప్ లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలోకి చేరాడు.
ఈ జాబితాలో శ్రీలంక మాజీ ఆటగాడు మహేళ జయవర్దెనే (31 మ్యాచ్ లలో 1,016 రన్స్), విరాట్ కోహ్లీ (23 మ్యాచ్ లలో 989), క్రిస్ గేల్ (33 మ్యాచ్ లలో 965) టాప్ -3 లో ఉన్నారు. రోహిత్ శర్మ.. 35 మ్యాచ్ లలో 904 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ కు ముందు శ్రీలంక మాజీ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ (34 మ్యాచ్ లలో 897) రోహిత్ కంటే ముందు ఉండేవాడు.