MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Rohit Sharma: ఆసీస్ బౌలర్లను దంచి.. ప్రపంచ రికార్డు సాధించి.. టీ20లలో హిట్‌మ్యాన్ మరో ఘనత

Rohit Sharma: ఆసీస్ బౌలర్లను దంచి.. ప్రపంచ రికార్డు సాధించి.. టీ20లలో హిట్‌మ్యాన్ మరో ఘనత

IND vs AUS T20I: టీమిండియా సారథి రోహిత్ శర్మ శుక్రవారం నాగ్‌పూర్‌లో విశ్వరూపం చూపాడు.  ఆసీస్ బౌలర్లకు తాను ఎదుర్కున్న రెండో బంతి నుంచే చుక్కలు లెక్కించే పని కల్పించాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Sep 24 2022, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఎన్నాళ్లయింది హిట్‌మ్యాన్ లో ఆ తరహా హిట్టింగ్ చూసి..?  ఎన్ని రోజులయింది రోహిత్ శర్మ  ప్రత్యర్థి బౌలర్లను క్లబ్ స్థాయి బౌలర్లలా మార్చి..? గత కొన్నాళ్లుగా బ్యాటింగ్ కు రావడం.. రెండు మూడు భారీ షాట్లు ఆడి పెవిలియన్‌కు చేరడమే తప్ప  ఇన్నింగ్స్ చివరివరకు నిలబడి మెరుపులు మెరిపించిన రోహిత్ ను చూసి చాలాకాలమైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కానీ శుక్రవారం రాత్రి అతడి ఫ్యాన్స్ తో పాటు టీమిండియా అభిమానులకు ఆ అవకాశం దక్కింది. 8 ఓవర్లకే 91 పరుగులు ఛేదించాల్సిన క్రమంలో తాను ఎదుర్కున్న రెండో బంతి నుంచే ఆసీస్ బౌలర్లకు చుక్కలు లెక్కించే పని చేశాడు హిట్‌మ్యాన్. 

37

టీ20లలో ప్రపంచ నెంబర్ వన్ బౌలరైన జోష్ హెజిల్వుడ్ మొదలు పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, డేనియల్ సామ్స్ అందరి బౌలింగ్ లో దంచికొట్టాడు. 20 బంతుల్లోనే 46 పరుగులు చేసిన రోహిత్.. 4 భారీ సిక్సర్లు, 4 బౌండరీలు బాదాడు. 

47

ఈ క్రమంలో  రోహిత్ టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత ఇన్నింగ్స్ లో భాగంగా హెజిల్వుడ్ వేసిన తొలి ఓవర్లో తాను ఎదుర్కున్న రెండో బంతికి సిక్సర్ కొట్టాడు. దీంతో అతడు మార్టిన్ గప్తిల్ పేరిట ఉన్న  అత్యధిక సిక్సర్ల (172) ను అధిగమించాడు. ఆ తర్వాత రోహిత్  మరో మూడు సిక్సర్లు బాదాడు. 

57

అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన వారి జాబితా చూస్తే రోహిత్ శర్మ.. 176 సిక్సర్లతో తొలిస్థానంలో ఉండగా మార్టిన్ గప్తిల్ (172) రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 124 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇయాన్ మోర్గాన్ (12), ఆరోన్ ఫించ్ (119) ల తర్వాత స్థానాల్లో నిలిచారు. 

67

రెండ్రోజులు వర్షం కురవడంతో ఔట్ ఫీల్డ్ తడిగా మారిన ఈ పిచ్ లో శుక్రవారం మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనేది అనుమానాలు తలెత్తాయి. అంపైర్లు పలు మార్లు గ్రౌండ్ ను పరిశీలించి.. 8 ఓవర్ల మ్యాచ్ ఆడించారు. 

77

ఈ మ్యాచ్ లో తొలుత  తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. వికెట్ కీపర్  మాథ్యూవేడ్ (43 నాటౌట్), కెప్టెన్ ఫించ్ (31) లు ధాటిగా ఆడారు.లక్ష్య ఛేదనలో  ఇండియా.. 7.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో భారత్‌కు విజయం దక్కింది. 

About the Author

SM
Srinivas M
రోహిత్ శర్మ
Latest Videos
Recommended Stories
Recommended image1
Team India Captain : సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్ ఔట్... టీమిండియా కెప్టెన్ ఇతడే..?
Recommended image2
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మామూలుగా లేదుగా.. బ్రాండ్ వాల్యూ డబుల్.. ఒక్కో యాడ్‌కు కోట్లలో డిమాండ్ !
Recommended image3
IPL Longest Sixes : వైభవ్ ఎన్ని సిక్సులు బాదితేనేం.. మన తెలుగోడు సింగిల్ సిక్స్ తోనే రఫ్పాడించాడుగా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved