వైజాగ్ టెస్ట్ లో రోహిత్ అద్భుత సెంచరీ... విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం
First Published Oct 2, 2019, 7:12 PM IST
వన్డే, టీ20 ఫార్మాట్లతో రోహిత్ శర్మ గొప్ప ఓపెనర్. కానీ తాజాగా కేవలం ఒకే ఒక ఇన్నింగ్స్ ద్వారా టెస్టుల్లో కూడా గొప్ప ఓపెనర్ గా మారిపోయాడు. అలా వైజాగ్ టెస్ట్ ద్వారా అతడు మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు.

రోహిత్ శర్మ... పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత ప్రమాదకర ఓపెనర్. అతడి బ్యాటింగ్ స్టైల్ సీనియర్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను పోలివుంటుందని ఇటీవలే కెప్టెన్ కోహ్లీ ప్రశంసించాడు. ఇదొక్కటి చాలు రోహిత్ ఎంత గొప్ప ఓపెనరో చెప్పడానికి. కానీ వన్డే, టీ20 ఫార్మాట్ లో తొందరగానే ఓపెనింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న అతడికి టెస్టుల్లో మాత్రం అంత ఈజీగా ఈ అవకాశం రాలేదు. అయితే కాస్త లేటయినా రావడం మాత్రం పక్కా... ఫార్మాట్ ఏదైనా ఓపెనర్ గా అదరగొట్టడం పక్కా అని రోహిత్ వైజాగ్ టెస్ట్ ద్వారా నిరూపించాడు.

భారత్-సౌతాఫ్రికాల మధ్య మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ఫ్రీడమ్ ట్రోఫీలో భాగంగా మూడు టెస్టుల సీరిస్ జరుగుతోంది. ఇందులోభాగంగా గాంధీ జయంతి రోజున అంటే ఇవాళ విశాఖపట్నంలో మొదటి టెస్ట్ ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా ప్లేయర్ రోహిత్ శర్మ పూర్తిస్థాయి ఓపెనర్ గా మారాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే టీ20, వన్డేల్లో ఓపెనర్ గా సత్తాచాటిన అతడు ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ ఎపెనర్ గా ఆరంగేట్రం చేశాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?