- Home
- Sports
- Cricket
- రోహిత్ శర్మ ఫామ్‌లో లేకుంటేనే మాట్లాడతాడు, ఫామ్‌లో ఉంటే... షాకింగ్ విషయాలు చెప్పిన పార్థివ్ పటేల్...
రోహిత్ శర్మ ఫామ్‌లో లేకుంటేనే మాట్లాడతాడు, ఫామ్‌లో ఉంటే... షాకింగ్ విషయాలు చెప్పిన పార్థివ్ పటేల్...
అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినా అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయాడు పార్థివ్ పటేల్. ఓ రకంగా పార్థివ్ పటేల్ ఫెయిల్యూర్, మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియాలోకి వచ్చి సక్సెస్ సాధించడానికి కారణమైంది. కోహ్లీ, ధోనీ, రోహిత్ కెప్టెన్సీలో ఆడిన పార్థివ్ పటేల్, టీమిండియా ప్రస్తుత సారథి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...

rohit sharma
‘ఫామ్‌లో లేని ప్లేయర్లతో రోహిత్ శర్మ చాలా సమయం గడుపుతాడు. ఇది నేను ఊరికే చెప్పడం లేదు. నా విషయంలో పర్సనల్‌గా ఇది జరిగింది. 2016 సీజన్‌లో నేను పెద్దగా ఫామ్‌లో లేను. అంతకుముందు సీజన్‌లో, ఆ తర్వాతి సీజన్‌లో బాగా ఆడాను. అయితే 2016 సీజన్‌లో రోహిత్ నాతో చాలాసేపు మాట్లాడేవాడు...
నేను పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతున్నప్పుడు నాతో మాట్లాడుతూ ప్రెషర్ పోగొట్టేవాడు. పరుగులు చేస్తుంటే మాత్రం పట్టించుకోడు. పెద్దగా మాట్లాడడు కూడా. కెప్టెన్‌లో ఉండాల్సిన ప్రధాన లక్షణం ఇది. ఫామ్‌లో లేని సమయంలోనే ప్లేయర్లకు కెప్టెన్ సపోర్ట్ కావాలి... ఆ విషయం రోహిత్‌కి బాగా తెలుసు...
రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్‌కి ప్లానింగ్ విషయంలో చాలా స్ఫష్టత ఉంది. వాళ్లేం చేయాలనుకుంటున్నారో ఏం చేయాలో వారికి బాగా తెలుసు. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లకు కావాల్సినంత సమయం ఇచ్చారు. బౌలర్లను రొటేట్ చేస్తూ వారికి ప్రాక్టీస్ దొరికేలా చేశారు..
Image credit: PTI
బుమ్రా గాయంతో తప్పుకోవడం టీమిండియాకి ఊహించని షాక్. దాన్ని ఎవ్వరూ తప్పించలేదు. అయితే పవర్ ప్లేలో కూడా స్పిన్నర్లను వాడడం మొదలెట్టారు. బుమ్రా లేకపోయినా గెలవడం ఎలాగో టీమిండియాకి బాగా తెలుసు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్...
చెన్నై సూపర్ కింగ్స్‌లో ఐపీఎల్ కెరీర్ మొదలెట్టిన పార్థివ్ పటేల్, 2011 సీజన్‌లో కొచ్చి టస్కర్స్ కేరళ, 2012లో డెక్కన్ ఛార్జర్స్, 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు. 2014 సీజన్‌లో ఆర్‌సీబీకి ఆడిన పార్థివ్ పటేల్, 2015 నుంచి 2017 సీజన్ వరకూ ముంబై ఇండియన్స్‌లో ఉన్నాడు.
2018 నుంచి 2020 వరకూ ఆర్‌సీబీకి ఆడిన పార్థివ్ పటేల్, దేవ్‌దత్ పడిక్కల్ కారణంగా 2020 సీజన్‌లో ఎక్కువ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అదే ఏడాది డిసెంబర్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న పార్థివ్ పటేల్, రిటైర్మెంట్ తర్వాత ముంబై ఇండియన్స్‌కి టాలెంట్ స్కాట్‌గా నియమితుడయ్యాడు...