ఇన్నాళ్లు బిల్డప్ కొట్టారు, ఇప్పుడు భయం మొదలై ఉండొచ్చు... పాకిస్తాన్ బౌలింగ్‌పై దినేశ్ కార్తీక్ కామెంట్..
గత కొన్నాళ్లుగా ఐసీసీ టోర్నీల్లో టీమిండియా కంటే బెటర్ పర్ఫామెన్స్ ఇస్తూ వస్తోంది పాకిస్తాన్. తమది వరల్డ్ క్లాస్ ఫాస్ట బౌలింగ్ యూనిట్ అంటూ బిల్డప్ ఇస్తూ వచ్చింది. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో భారత ఓపెనర్లు, పాక్ ఫాస్ట్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు..
Rohit Sharma
పాక్ ప్రధాన పేస్ ఆయుధం షాహీన్ షా ఆఫ్రిదీతో పాటు నసీం షా, హారీస్ రౌఫ్‌ని కూడా ఈజీగా ఫేస్ చేసిన రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్.. 16 ఓవర్లలోనే 120 పరుగులు రాబట్టేశారు. గ్రూప్ మ్యాచ్‌లో పాక్ బౌలింగ్ ఎదుర్కోవడానికి తడబడిన ఈ ఇద్దరూ.. సూపర్ 4 మ్యాచ్‌లో కౌంటర్ అటాక్ చేశారు..
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో సెమీఫైనల్ చేరిన పాకిస్తాన్, ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ ఫైనల్ చేరింది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది పాకిస్తాన్..
Rohit Sharma_Shubman Gill
‘షాహీన్ ఆఫ్రిదీని రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఎదుర్కొన్న విధానం... పాకిస్తాన్‌కి తలనొప్పులు తెచ్చిపెట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఇన్నాళ్లు షాహీన్ ఆఫ్రిదీని మనవాళ్లు ఫేస్ చేయలేరని ధీమాగా చెప్పుకుంటూ వచ్చింది పాకిస్తాన్..
ఇప్పుడు మనవాళ్లు ఈజీగా షాహీన్ బౌలింగ్‌లో బౌండరీలు బాదేశారు. షాహీన్ వేసే స్లో డెలివరీలను ఫేస్ చేయడం బ్యాటర్లకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అతని మణికట్టుతో బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తాడు...
అయితే రెండోసారి షాహీన్ ఆఫ్రిదీని భారత బ్యాటర్లు ఆడేసుకున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో షాహీన్‌ని ఎదుర్కోవడానికి కావాల్సిన ధీమా, ఈ మ్యాచ్‌తో వచ్చేసి ఉంటుంది. ఇది కచ్ఛితంగా పాకిస్తాన్‌లో భయం పుట్టించి ఉంటుంది.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్..
Shaheen Afridi
5 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చిన షాహీన్ ఆఫ్రిదీ, రెండో స్పెల్‌లో శుబ్‌మన్ గిల్‌ని అవుట్ చేశాడు. అయితే మొదటి 2 ఓవర్లలోనే షాహీన్ బౌలింగ్‌లో 6 ఫోర్లు బాదాడు శుబ్‌మన్ గిల్.. అలాగే ఆఫ్రిదీ వేసిన మొదటి ఓవర్‌లో ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు రోహిత్ శర్మ.