- Home
- Sports
- Cricket
- స్టార్ ఆల్‌రౌండర్ కు రోహిత్ షాక్.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ ఎందుకు కాలేకపోయాడు?
స్టార్ ఆల్‌రౌండర్ కు రోహిత్ షాక్.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ ఎందుకు కాలేకపోయాడు?
Hardik Pandya: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. అయితే, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు షాక్ తగిలింది. అతని కెప్టెన్సీ కల చెదరిపోయినట్టేనా?

Hardik Pandya: ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో 15 మంది సభ్యులతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. అయితే, ఈ జట్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే, భారత కెప్టెన్సీ రేసులో ఉన్న స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు జట్టులో స్థానం దక్కింది కానీ, అతన్ని వైస్ కెప్టెన్సీ నుంచి ఔట్ చేశారు. శుభ్ మన్ గిల్ ఇప్పుడు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. అలాగే, టీ20 జట్టులో కూడా వైస్ కెప్టెన్సీ నుంచి పాండ్యా ఔట్ అయ్యాడు. అక్కడ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా వచ్చాడు.
వైస్ కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్
భారత క్రికెట్ జట్టులో మరోసారి పెద్ద వివాదం తలెత్తింది. భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను తొలగించారు. పాండ్యాను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించడంపై భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ పదవి నుంచి పాండ్యాను తొలగించేందుకు ఎలాంటి లాజికల్ కారణం లేదని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
2024 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ టీ20 క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత హార్దిక్ తదుపరి కెప్టెన్‌గా కనిపించాడు. అయితే కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ లు సూర్యకుమార్ యాదవ్‌కు భారత టీ20 జట్టు కెప్టెన్సీని అప్పగించారు. ఇప్పుడు హార్దిక్‌ను వైస్ కెప్టెన్‌గా కూడా చేయలేదు.
అక్షర్ పటేల్ కొత్త వైస్ కెప్టెన్ అయ్యాడు
టీ20 ప్రపంచకప్ తర్వాత, శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే ఆ తర్వాత అతడిని జట్టు నుంచి తప్పించారు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లకు అతన్ని ఎంపిక చేయలేదు.
ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌లో అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నిర్ణయం కార్తీక్‌ను ఆశ్చర్యపరిచింది. హార్దిక్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడం సబబు కాదన్నారు.
బీసీసీఐకి దినేష్ కార్తీక్ ప్రశ్నలు
మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ క్రిక్‌బజ్ తో మాట్లాడుతూ.. "నాకు నిజంగా తెలియదు అతనిని (హార్దిక్) వైస్ కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారో నాకు తెలియదు? నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు. అతను జట్టుకు కెప్టెన్ గా బాగా పనిచేశాడు. అతను జట్టుకు కెప్టెన్‌గా కొనసాగిన సమయంలో ద్వైపాక్షిక మ్యాచ్‌లను గెలుచుకున్నాడని" గుర్తుచేశాడు.
Rohit Sharma, Hardik pandya
కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా రికార్డులు ఎలా ఉన్నాయంటే?
2022 టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 జట్టుకు హార్దిక్ సారథ్యం వహించాడు. అతను 16 మ్యాచ్‌లలో జట్టును నడిపించాడు. 11 మ్యాచ్‌లలో విజయం సాధించాడు. 2024 ప్రపంచ కప్‌లో భారతదేశం విజయం సాధించిన తర్వాత రోహిత్ రిటైర్మెంట్ తర్వాత, హార్దిక్ కెప్టెన్ కావడానికి బలమైన పోటీదారుగా ఉన్నాడు. ఉన్నాడు కానీ, ఇప్పుడు అతను కెప్టెన్ కాదు.. వైస్ కెప్టెన్ రేసు నుంచి కూడా ఔట్ అయ్యాడు.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఏం చెప్పారంటే?
విలేకరుల సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సూర్యకుమార్ ఎంపిక వెనుక ఉన్న లాజిక్‌ను వివరించారు. ఇందులో, తరచుగా అందుబాటులో ఉండే ఆటగాడి కోసం జట్టు అవసరంపై దృష్టి పెట్టారు. హార్దిక్‌ను కెప్టెన్సీకి ఎంపిక చేయనప్పటికీ, అతను నిరంతరం మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అక్టోబరు 2024లో బంగ్లాదేశ్‌పై భారత్ 3-0తో విజయం సాధించడంలో అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.
కానీ, హార్దిక్ పాండ్యా తరచుగా గాయాలు పాలు అవుతూ జట్టుకు దూరం అవుతున్నాడు. టీమ్ ను నడిపించే నాయకుడు ఇలా గాయాలతో జట్టుకు తరచుగా దూరం కావడం జట్టు పై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంటే కాబోయే రోజుల్లో కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ రేసులో లేడనే సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది.