రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వడమే టీమిండియా చేసిన అతి పెద్ద తప్పు... ఇయాన్ బిషప్ కామెంట్....
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ నుంచి ఇంటిదారి పట్టింది. భారీ అంచనాలతో టోర్నీని మొదలెట్టిన భారత జట్టు, ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడి సెమీస్ నుంచి నిష్కమించింది. రోహిత్ శర్మతో పాటు ఓపెనర్ కెఎల్ రాహుల్ ఫెయిల్యూర్ టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపించింది...
Rohit Sharma
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత రెండేళ్లకు 2024లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు సీనియర్లు ఇకపై టీ20లకు దూరంగా ఉండబోతున్నారని, కొత్త ప్లేయర్లకు పొట్టి ఫార్మాట్‌లో అవకాశాలు ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది..
‘టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్ నుంచి నిష్కమించిన తర్వాత వారి విధానాలపై చర్చ జరుగుతోంది. ఇది సహజం... విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ అప్పగించారు. 35 ఏళ్ల వయసులో రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వడమే టీమిండియా చేసిన అతి పెద్ద తప్పిదం...
Rohit Sharma
రోహిత్ శర్మ చాలా అనుభవం ఉన్న ప్లేయర్, సీనియర్ ఓపెనర్... మంచి బ్యాట్స్‌మెన్... ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ఐదు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్. అయితే టీ20ల్లో టీమిండియాని నడిపించాలంటే వీటితో పాటు వయసు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందే...
Rohit-Rahul
35 ఏళ్ల వయసులో రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ అప్పగిస్తే, ఆ ప్రెషర్‌ని అతను హ్యాండీల్ చేయగలడు. ఈ విషయాలను సెలక్టర్లు కానీ, బీసీసీఐ కానీ పట్టించుకోలేదు. ఫలితం.. రోహిత్ శర్మ కెప్టెన్సీ భారాన్ని మోయలేక బ్యాటర్‌గానూ ఫెయిల్ అయ్యాడు...
Image credit: PTI
ప్లేయర్ల విషయంలో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా అవసరం. టీమిండియా ఈ విధంగా ఆలోచించే వరల్డ్ కప్‌కి ముందు సిరీసుల్లో వేరే ప్లేయర్లకు కెప్టెన్సీ ఇచ్చి ఉంటుంది. అయితే రోహిత్ శర్మ, ఆసియా కప్‌లో ఫెయిల్ అయ్యాక డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు కనిపిస్తున్నాడు...
Image credit: PTI
వెస్టిండీస్‌తో సిరీస్ సమయంలోనే రోహిత్‌ని ఈ ప్రశ్న అడిగాడు. ‘మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ అంటే వర్క్ లోడ్‌ని మేనేజ్ చేయగలవా?’ అని ప్రశ్నించాను. దానికి అతను చెప్పిన సమాధానం మొక్కుబడిగా చెప్పినట్టు అనిపించింది. మంచి కెప్టెన్, మంచి మేనేజ్‌మెంట్, మంచి టీమ్ ఉంటే సరిపోదు... దాన్ని వాడుకునే శక్తి, సామర్థ్యం ఉండాలి...
Hardik Pandya, rohith sharma
టీ20 ఫార్మాట్‌కి ఫీల్డ్‌లో మెరుపులా కదిలే కెప్టెన్ కావాలి. ముందుండి నడిపించే సారథి కావాలి. రోహిత్ శర్మలో ఇప్పుడు ఆ లక్షణాలు కనిపించడం లేదు. అతను కెప్టెన్సీ ప్రెషర్‌ని తట్టుకోలేకపోతున్నాడు. రిస్క్ తీసుకున్నప్పుడే సక్సెస్ దొరుకుతుంది...
టీమిండియా మాత్రం అలాంటి రిస్క్ చేయలేదు. విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగానే సీనియర్, ఐపీఎల్ విన్నర్ అనే కారణంగా రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించింది. నా వరకూ రిషబ్ పంత్ లేదా హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్‌లకు టీమిండియా కెప్టెన్సీ అప్పగించాల్సింది...’ అంటూ కామెంట్ చేశాడు ఇయాన్ బిషప్...