అందుకే బౌలింగ్ చేయడం ఆపేశా! అయితే వరల్డ్ కప్‌లో... రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
స్టీవ్ స్మిత్ మాదిరిగానే స్పిన్నర్‌గా టీమ్‌లోకి వచ్చి, బ్యాటర్‌గా సెటిల్ అయ్యాడు రోహిత్ శర్మ. 2009 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కి ఆడిన రోహిత్ శర్మకు ఐపీఎల్‌లో హ్యాట్రిక్ కూడా ఉంది. ఐపీఎల్‌లో హ్యాట్రిక్ తీసి, సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ కూడా రోహితే..
ఐపీఎల్ కెరీర్‌లో 15 వికెట్లు తీసిన రోహిత్ శర్మ, 2009 సీజన్‌లోనే 11 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల్లో రెండు, వన్డేల్లో 8, టీ20ల్లో ఓ వికెట్ తీసిన రోహిత్ శర్మ.. ఓపెనర్‌గా మారిన తర్వాత బౌలింగ్ చేయడం పూర్తిగా తగ్గించేశాడు..
2012 నుంచి 2016 వరకూ నాలుగేళ్లలో కేవలం నాలుగు వన్డేల్లో మాత్రమే బౌలింగ్ చేశాడు రోహిత్ శర్మ. 2016 టీ20 వరల్డ్ కప్ తర్వాత పూర్తిగా బౌలింగ్ చేయడం మానేశాడు. ఐపీఎల్‌లో చివరిగా 2014లో బౌలింగ్ చేసిన రోహిత్, 2021లో అత్యవసర పరిస్థితుల్లో 7 బంతులు బౌలింగ్ వేశాడు..
సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ వంటి సీనియర్లు తమ కెరీర్‌లో బ్యాటింగ్‌తో పాటు పార్ట్ టైమ్ బౌలర్లుగా కూడా రాణించారు. రెగ్యూలర్ బౌలర్లు వికెట్లు తీయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు, వరుస ఓవర్లు బౌలింగ్ చేసి అలిసిపోయినప్పుడు పార్ట్ టైమ్ బౌలర్లు చాలా కీలకం అవుతారు..
అందుకే పార్ట్ టైమ్ బౌలర్‌గా టెస్టుల్లో 46 వికెట్లు తీసిన సచిన్ టెండూల్కర్, వన్డేల్లో 154 వికెట్లు పడగొట్టాడు. సెహ్వాగ్ వన్డేల్లో 96, టెస్టుల్లో 40 వికెట్లు తీయగా సౌరవ్ గంగూలీకి కూడా వన్డేల్లో 100 వికెట్లు, టెస్టుల్లో 32 వికెట్లు దక్కాయి..
‘బౌలింగ్ చేస్తున్నప్పుడు నా వేలికి కాస్త ఇబ్బంది కలగడం మొదలైంది. అది నా బ్యాటింగ్‌పై ప్రభావం చూపించకూడదనే బౌలింగ్ వేయడం తగ్గించాను. అయితే ఇప్పటికీ కొన్నిసార్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. అవసరమైతే బౌలింగ్ చేయడానికి సిద్ధమే.. చూద్దాం ఏం జరుగుతోందో..’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ..
kohli
మరోవైపు విరాట్ కోహ్లీ కూడా టీ20, వన్డేల్లో నాలుగేసి వికెట్లు తీశాడు. 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో వికెట్ తీసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత బౌలింగ్ చేయడం మానేశాడు. 2022 టీ20 వరల్డ్ కప్ సమయంలో విరాట్ బౌలింగ్ చేస్తాడని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు..