- Home
- Sports
- Cricket
- Rohit Sharma: తొలి టెస్టులోనే సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ.. అప్పటికే 108 వన్డేలు ఆడేశాడా !
Rohit Sharma: తొలి టెస్టులోనే సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ.. అప్పటికే 108 వన్డేలు ఆడేశాడా !
Rohit Sharma retires: భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. తన తొలి టెస్టు కోసం దాదాపు 6 ఏళ్ల నిరీక్షించిన రోహిత్ శర్మ.. 177 పరుగుల సెంచరీతో టెస్టు కెరీర్ ప్రారంభించి చరిత్ర సృష్టించాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Rohit Sharma: టీమిండియా సీనియర్ స్టార్ ఓపెనర్, మాజీ టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. "హలో ఎవరివర్, నేను టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని ప్రకటించాలనుకుంటున్నాను. తెల్లజెర్సీ వేసుకుని దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం" అని రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రిటైర్మెంట్ విషయం ప్రకటించాడు. రోహిత్ రిటైర్మెంట్ తో భారత్ టెస్టు చరిత్రలో ఓ ముఖ్య అధ్యాయం ముగిసింది.
38 ఏళ్ల వయసులో రోహిత్ 67 టెస్టులాడి 4,301 పరుగులు చేశారు. ఇందులో 12 శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి. ఆయన సగటు 40.57 గా ఉంది. అయితే ఈ గణాంకాలు రోహిత్ ప్రయాణంలోని అర్థం మాత్రమే చెబుతాయి. కానీ, టెస్టు డెబ్యూ కోసం రోహిత్ శర్మ 6 సంవత్సరాలు నిరీక్షించాల్సి వచ్చింది. అంతేకాదు, టెస్టు క్యాప్ అందుకునేలోపు ఇప్పటికే 108 వన్డేలు ఆడారు.
2010లో నాగ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాపై టెస్టు డెబ్యూ అవకాశం వచ్చిందనగా, టాస్‌కు ముందు వార్మప్ సమయంలో గాయపడ్డాడు రోహిత్. ఆ తర్వాత 2013 నవంబర్ 7న వెస్టిండీస్‌తో టెస్టు డెబ్యూ చేశారు. ఇది సచిన్ టెండూల్కర్ వీడ్కోలు సిరీస్ కాగా, రోహిత్ తన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లోనే 177 పరుగుల సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తన టెస్ట్ కెరీర్‌ను సెంచరీతో ప్రారంభించాడు.
"ఇంతకాలం ఎదురుచూసిన తర్వాత ఇంత గొప్ప స్థాయిలో అరంగేట్రం చేయడం మరిచిపోలేనిది" అని రోహిత్ ఆ మ్యాచ్ అనంతరం అన్నాడు. అప్పట్లో రవిచంద్రన్ అశ్విన్ (124) తో కలిసి 280 పరుగుల భాగస్వామ్యం చేసి టీమిండియాను కష్టస్థితిలోంచి బయటపడేశారు.
ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు రోహిత్ టెస్టు జట్టులో స్థిరపడలేకపోయాడు. కానీ 2019లో ఓపెనర్‌గా మళ్లీ పునరాగమనం చేశాడు. దక్షిణాఫ్రికాపై 176, 127 పరుగులు చేసి జట్టులో స్థిరపడ్డాడు. తర్వాత రాంచీలో డబుల్ సెంచరీ కొట్టాడు.
2023లో టెస్టు ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్‌ను తీసుకెళ్లిన రోహిత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో తన ఫామ్ తో ఇబ్బంది పడుతుండగా, స్వయంగా టీమ్ నుంచి తప్పుకోవడం విశేషం. ఇది భారత క్రికెట్‌లో అరుదైన నిజాయితీతో గొప్ప అంశంగా నిలిచింది.
ఇప్పటికే 2023 ప్రపంచకప్ తర్వాత టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, ఇప్పుడు టెస్టు నుంచి కూడా తప్పుకున్నాడు. దీంతో రోహిత్ క్రికెట్ కెరీర్ వన్డేలతో ముగియనుంది. ఏదేమైనా రోహిత్ ప్రయాణం మరచిపోలేని కథ. 108 వన్డేలు ఆడి టెస్టు డెబ్యూ చేసిన ఆటగాడిగా, మొదటి మ్యాచ్‌లోనే శతకం బాదిన స్టార్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. రోహిత్ శర్మ తన వన్డే క్రికెట్ అరంగేట్రం జూన్ 23, 2007న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చేశాడు. అరంగేట్రం మ్యాచ్ లో 15 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.