MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సినిమా లేదు! తొక్కా లేదు... రోహిత్, రష్మిక, గంగూలీ హంగామా అంతా దీనికోసమే...

సినిమా లేదు! తొక్కా లేదు... రోహిత్, రష్మిక, గంగూలీ హంగామా అంతా దీనికోసమే...

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? సడెన్‌గా సోషల్ మీడియాలో ‘మెగా బ్లాక్ ‌బస్టర్’ అంటూ ఓ పోస్టర్‌ని విడుదల చేసిన రోహిత్, ఫ్యాన్స్‌లో అనేక అనుమానాలు రేపాడు. రోహిత్‌ శర్మతో పాటు సౌరవ్ గంగూలీ, హీరోయిన్ రష్మిక మంధాన్న కూడా ‘మెగా బ్లాక్‌బస్టర్‌’లో నటించబోతున్నారంటూ పోస్టులు వైరల్ అయ్యాయి...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 02 2022, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రోహిత్ శర్మ కెప్టెన్‌గా మారిన తర్వాత టీమిండియాకి 7 నెలల్లో 8 మంది కెప్టెన్లు మారారు. హిట్ మ్యాన్ ఫిట్‌నెస్ ఏంటో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అలాంటి రోహిత్ శర్మ, సినిమాల్లో నటించడమంటే చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్టే...

27
rohit

rohit

‘బటర్ ఫ్లైస్ ఇన్ మై స్టమక్... ట్రైయిలర్ సెప్టెంబర్ 4న వస్తుంది... మెగా బ్లాక్‌బస్టర్’ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించాడు రోహిత్ శర్మ. రోహిత్‌కి ఖాళీ ఎప్పుడు దొరికింది, సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగింది... ట్రైలర్ దాకా ఎలా వచ్చింది...

37
Rohit Sharma

Rohit Sharma

ఆసియా కప్ 2022 ప్రోమోలోనే చాలా నీరసంగా, బద్ధకంగా నటించాడు రోహిత్ శర్మ. ఆసియా కప్ 2022 ప్రోమో చూసిన వాళ్లకి నీరసం వచ్చేసింది. అలాంటి రోహిత్ సినిమాలో నటిస్తున్నాడా... సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చే జరిగింది..

47
Rohit Sharma

Rohit Sharma

సినిమాలంటే ఫైట్లు చేయాలి, డ్యాన్సులు చేయాలి... పరుగెత్తాలి, పరుగెత్తించాలి... ఇవన్నీ రోహిత్ శర్మ వల్ల అయ్యే పనేనా. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే రోహిత్ శర్మ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నాడా... అంటూ రకరకాల అనుమానాలు రేగాయి..

57
rohit sharma

rohit sharma

హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు సోషల్ మీడియాలో, బయట చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా ఐదు టైటిల్స్ అందించిన రోహిత్, టీ20 వరల్డ్ కప్ 2022, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత జట్టుకి టైటిల్స్ అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు...

67
Image credit: PTI

Image credit: PTI

అయితే ఈ హడావుడి అంతా దేనికోసమో తేలిపోయింది. ప్రమోషన్ పోస్టులు చేయడంలో పెద్దగా అనుభవం లేని సౌరవ్ గంగూలీ, ‘మెగా బ్లాక్‌బస్టర్’ పోస్టుకి ఇచ్చిన కాప్షన్‌లో అసలు విషయం బయటపెట్టేశాడు... ఇదంతా మీషో యాప్ కోసం చేస్తున్న ప్రమోషన్ అట...

77
Rashmika Mandanna

Rashmika Mandanna

ఎక్కడ ‘మీషో’ యాప్ అని రాకుండా జాగ్రత్త పడాలంటూ ఆ యాడ్ రూపకర్తలు పంపిన మెసేజ్‌ని కనీసం చదవకుండా అలాగే ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు సౌరవ్ గంగూలీ. ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసినా అప్పటికే జనాలకు అసలు విషయం తెలిసిపోయింది... 

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
మైదానంలో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. టీమిండియాపై పాక్ జట్టుదే పైచేయి
Recommended image2
సూపర్ 8 తొలి మ్యాచ్‌లోనే పాక్‌కు ఝలక్.! సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిందే
Recommended image3
India vs South Africa : ఓపెనర్లు ఫ్లాప్.. మిడిల్ ఆర్డర్ డీలా ! ముంచేశారు భయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved