MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పేరుకే కెప్టెన్! ఏడాదిలో ఒక్క టెస్టుకీ కెప్టెన్సీ చేయలేకపోయిన రోహిత్ శర్మ... విదేశాల్లో ఆ ముగ్గురు...

పేరుకే కెప్టెన్! ఏడాదిలో ఒక్క టెస్టుకీ కెప్టెన్సీ చేయలేకపోయిన రోహిత్ శర్మ... విదేశాల్లో ఆ ముగ్గురు...

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకుని ఏడాది దాటిపోయింది. టెస్టుల్లో సారథిగా తీసుకుని 11 నెలలు అవుతోంది. అయినా రోహత్ శర్మ ఈ ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్క ఫారిన్ టెస్టు కూడా ఆడలేకపోయాడు. వైట్ బాల్ క్రికెట్‌లో ఏడుగురు కెప్టెన్లను మార్చిన భారత జట్టు, టెస్టుల్లోనూ ముగ్గురు కెప్టెన్లను మార్చింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 26 2022, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రోహిత్ శర్మ.  2021 చివర్లో సౌతాఫ్రికా టూర్‌తో టీమిండియా చిచ్చు మొదలైంది. వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యాడు..

29

తనను బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో మనస్థాపం చెందిన విరాట్ కోహ్లీ, బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు 15 నిమిషాల ముందు చెప్పారని మీడియా కాన్ఫిరెన్స్‌లో వాపోయాడు. ఈ కామెంట్లు అప్పట్లో పెను దుమారం రేపాయి...

39

అయితే వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, టూర్‌‌కి పయనమయ్యేముందు గాయపడడంతో టీమిండియాకి షాక్ తగిలింది. రోహిత్ స్థానంలో కెఎల్ రాహుల్ టీమిండియాకి టెస్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కోహ్లీ వెన్నునొప్పితో దూరం కావడంతో భారత జట్టుకి పరాజయమే లేని జోహన్‌బర్గ్ టెస్టుకి కెప్టెన్నీ చేశాడు రాహుల్...

49

కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టులో రీఎంట్రీ ఇచ్చి కెప్టెన్సీ చేసిన విరాట్ కోహ్లీ.. ఆ మ్యాచ్‌లో ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్‌గా కూడా తప్పుకుంటున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రకటనతో టెస్టు కెప్టెన్సీని కూడా రోహిత్ శర్మకే అప్పగించింది బీసీసీఐ...

59

స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కి కెప్టెన్సీ చేసిన రోహిత్ శర్మ, విదేశాల్లో మాత్రం ఒక్క టెస్టు కూడా ఆడలేకపోయాడు. గత ఏడాది ఆగస్టులో కరోనా కారణంగా వాయిదా పడిన ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు...
 

69
Image credit: Getty

Image credit: Getty

రోహిత్ శర్మ గాయపడడం, కెఎల్ రాహుల్ కూడా గాయంతో జట్టుకి దూరం కావడంతో జస్ప్రిత్ బుమ్రాకి టెస్టు కెప్టెన్సీ చేసే గౌరవం దక్కింది. ఆ టెస్టులోనూ ఓడింది భారత జట్టు. ఇంగ్లాండ్ టెస్టు ముగిసిన నాలుగు నెలలకు బంగ్లాదేశ్ పర్యటనకి వెళ్లింది భారత జట్టు...

79

వన్డే సిరీస్‌లో గాయపడిన రోహిత్ శర్మ, టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడు. జస్ప్రిత్ బుమ్రా కూడా జట్టులో లేకపోవడంతో మళ్లీ కెఎల్ రాహుల్‌కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది టీమిండియా. టెస్టు కెప్టెన్‌గా రెండు విజయాలు అందుకున్న కెఎల్ రాహుల్, విదేశాల్లో టెస్టు సిరీస్ గెలిచిన భారత కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు...

89

ఈ ఏడాది విదేశాల్లో ఆడిన ఐదు టెస్టుల్లో ముగ్గురు కెప్టెన్లను వాడింది భారత జట్టు. అయితే ఒక్క ఫారిన్ టెస్టుకి కూడా భారత రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం విశేషం..

99

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడే టీమిండియా, ఆ సిరీస్ గెలిస్తే... ఇంగ్లాండ్‌లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కనీసం ఆ మ్యాచ్‌కైనా రోహిత్ అందుబాటులో ఉంటాడా? అనేది చూడాలి.. 

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ రద్దయితే విజేత ఎవరో తెలుసా?
Recommended image2
IND vs NZ : ఒక్క మ్యాచ్.. 3 వరల్డ్ రికార్డులు ! ప్రపంచ క్రికెట్‌లో భారత్ బాహుబలి
Recommended image3
IND vs NZ : ఫైనల్లో సంజూ శాంసన్ సెంచరీ.. కప్పు మనదే బాసూ.. ఇదీ అసలు లెక్క !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved