MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కెప్టెన్స్ మీట్‌కు ముంబై సారథి డుమ్మా.. హిట్‌మ్యాన్ ఎందుకు రానట్టు..?

కెప్టెన్స్ మీట్‌కు ముంబై సారథి డుమ్మా.. హిట్‌మ్యాన్ ఎందుకు రానట్టు..?

IPL 2023: ఐపీఎల్  - 16 ప్రారంభానికి ముందు  పది ఫ్రాంచైజీల సారథులు ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోలకు ఫోజులిచ్చారు.   కానీ ముంబై సారథి రోహిత్ మాత్రం ఇందులో లేడు. 

2 Min read
Author : Srinivas M
Published : Mar 30 2023, 06:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీమిండియా సారథి, ఐపీఎల్ లో  అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ టీమ్ కు  కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మకు ఏమైంది..? ఐపీఎల్ లో తొలి మ్యాచ్ కు  అతడు అందుబాటులో ఉండటం లేదా..?   ఇప్పుడు ముంబై  ఇండియన్స్ ఫ్యాన్స్  ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
 

26

ఐపీఎల్ - 16 ఓపెనింగ్ కు ముందు అహ్మదాబాద్ వేదికగా నిర్వహించిన కెప్టెన్స్ మీట్ లో  9 జట్ల సారథులు పాల్గొన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న గుజరాత్ జెయింట్స్   సారథి  హార్థిక్ పాండ్యా, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్   సంజూ శాంసన్, చెన్నై సూపర్ కింగ్స్  నాయకుడు ఎంఎస్ ధోనిలతో పాటు డేవిడ్ వార్నర్ (ఢిల్లీ), ఏబీడివిలియర్స్ (ఆర్సీబీ), శిఖర్ ధావన్ (పంజాబ్),  నితీశ్ రాణా  (కోల్కతా) లు పాల్గొన్నారు. 

36

సన్ రైజర్స్  హైదరాబాద్ సారథి  ఎయిడెన్ మార్క్‌రమ్  ప్రస్తుతం  సౌతాఫ్రికాలోనే ఉన్నాడు. అతడి స్థానంలో   ఎస్ఆర్హెచ్ సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్  హాజరయ్యాడు.  కానీ  ఈ  మీట్ కు ముంబై సారథి  రోహిత్ శర్మ రాలేదు. ఎంత బిజీగా ఉన్నా ఐపీఎల్ ప్రారంభానికి ముందు  జరిగే కెప్టెన్స్ మీట్ లో అన్ని జట్ల  సారథులూ పాల్గొంటారు. కాన  రోహిత్ రాకపోవడం  పలు అనుమానాలకు దారి తీస్తున్నది. 

46

ఏప్రిల్ 1న   చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్ ఆడనుంది. మరి ఈ మ్యాచ్ కు  రోహిత్  అందుబాటులో ఉంటాడా..? ఉండడా..? అన్నదీ అనుమానంగానే ఉంది.  రోహిత్ కు ఏమైనా గాయమైందా..? లేక మరేదైనా సమస్య వల్ల ఈ  మీటింగ్ ను ఎగ్గొట్టాడా..? అన్న చర్చా సాగుతోంది. 

56

కాగా నిన్న (బుధవారం)  ముంబైలో హెడ్ కోచ్ మార్క్ బౌచర్ తో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న  రోహిత్ శర్మ పాల్గొన్నాడు.  విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఉత్సాహంగానే సమాధానాలు చెప్పాడు.  కానీ ఇప్పుడు ఉన్నఫళంగా కెప్టెన్సీ మీట్ కు డుమ్మా కొట్టడానికి గల కారణాలు మాత్రం తెలిసిరాలేదు.  
 

66

బుధవారం   ముంబై ఇండియన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత కూడా  రోహిత్.. స్టార్ స్పోర్ట్స్ లో  జరిగిన ఫోటో షూట్ లో  పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఫోటో షూట్ తర్వాత అభిమానులతో కలిసి ఫోటోలు దిగిన  హిట్‌మ్యాన్  కెప్టెన్స్ మీట్ కు ఎందుకు రాలేదనది ప్రస్తుతానికి సస్పెన్సే...!

About the Author

SM
Srinivas M
రోహిత్ శర్మ
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi : పెద్ది సెట్స్‌లో తిలక్ రచ్చ.. చరణ్ అదిరిపోయే గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
MI : రోహిత్ శర్మ షాకింగ్ డెసిషన్? ఐపీఎల్ 2026 తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై?
Recommended image3
CSK : ధోనీ ఇక నంబర్ 7 కాదు? ఐపీఎల్ 2026 కోసం సరికొత్త ప్లాన్.. !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved