విరాట్ స్థానాన్ని రోహిత్ భర్తీ చేయలేడు, ఆ ప్లేస్‌లో అతనైతే బెస్ట్... హర్భజన్ సింగ్ కామెంట్!!

First Published 22, Nov 2020, 6:19 PM

ఆసీస్ టూర్‌లో భారత ప్రదర్శన ఎలా ఉంటుందనే విషయం మీద కంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ స్థానాన్ని టెస్టుల్లో భర్తీ చేసేది ఎవరనే టాపిక్‌పైనే ఫోకప్ పెడుతున్నారు నెటిజన్లు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు. నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా టూర్‌లో మొదటి టెస్టు ముగిసిన తర్వాత భారత సారథి విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి రానున్నాడు. పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి పయనమయ్యే కోహ్లీ స్థానాన్ని అందరూ భావిస్తున్నట్టుగా రోహిత్ శర్మ భర్తీ చేయలేడని అంటున్నాడు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్.

డిసెంబర్ 17న ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో మొదటి పింక్ బాల్ టెస్టు ఆడబోతోంది టీమిండియా. నిజానికి న్యూఇయర్ సమయంలో పింక్ బాల్ టెస్టు జరగాల్సింది. అయితే కోహ్లీ కోసం మొదటి టెస్టునే డే-నైట్ టెస్టుగా నిర్వహించేందుకు ఆస్ట్రేలియాను ఒప్పించింది బీసీసీఐ.

విరాట్ కోహ్లీ మొదటి టెస్టు ముగిసిన తర్వాత పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశం రాబోతున్నాడు. గాయం కారణంగా వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమైన రోహిత్ శర్మ, టెస్టు సిరీస్ సమయానికి ఆస్ట్రేలియా చేరుకోబోతున్నాడు...

కోహ్లీ లాంటి దూకుడైన బ్యాట్స్‌మెన్, కెప్టెన్ లేకుండానే మూడు టెస్టులు ఆడబోతోంది టీమిండియా. ఈ మ్యాచుల్లో కోహ్లీ స్థానాన్ని రోహిత్ శర్మ భర్తీ చేస్తాడని అభిప్రాయపడ్డారు చాలామంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు...

అయితే భారత ‘టర్బోనేటర్’ హర్భజన్ సింగ్ మాత్రం కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ కంటే కెఎల్ రాహుల్ అయితే బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తాడని అంటున్నాడు. ‘టెస్టు ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. టెస్టుల్లోనే కాదు వన్డేలు, టీ20ల్లో కూడా కోహ్లీ ట్రాక్ అద్భుతం...

టెస్టుల్లో నాలుగో స్థానంలో వచ్చే బ్యాట్స్‌మెన్‌పైన భారం ఎక్కువగా ఉంటుంది. ఆ స్థానంలో రోహిత్ శర్మను దింపితే, అతను తన సహజ శైలిలో పర్ఫామెన్స్ ఇవ్వలేడు. నా ఉద్దేశంలో రోహిత్ శర్మను ఓపెనర్‌గానే ఆడించాలి...

మంచి ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తే... బాగా రాణిస్తాడు. కోహ్లీ గైర్హజరీతో ఖాళీ అయ్యే ప్లేస్‌ను భర్తీ చేయగల బ్యాట్స్‌మెన్ రాహుల్... ’ అంటూ తన అభిప్రాయం వెల్లడించాడు హర్భజన్ సింగ్.

ఇరు జట్లు కూడా మొదటి మ్యాచ్ నుంచి ఆధిక్యం కోసం ప్రయత్నిస్తాడని, అవకాశం దొరికితే ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టేందుకు చూస్తాయని చెప్పిన భజ్జీ... బెటర్ క్రికెట్ ఆడుతూ బెస్ట్ బౌలింగ్ చేసే టీమ్‌కే విజయం దక్కుతుందని చెప్పాడు.

‘ఆస్ట్రేలియాతో పోలిస్తే పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియాకే ఎక్కువ ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన జట్టులో సిరాజ్, బుమ్రా, ఇషాంత్ శర్మ వంటి అద్భుతమైన బౌలింగ్ లైనప్ ఉంది... ’ అన్నాడు హర్భజన్ సింగ్.

2019 జనవరిలో జరిగిన సిడ్నీ టెస్టులో అదరగొట్టిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విషయంలో అప్పుడు రవిశాస్త్రి చేసిన ఓ కామెంట్‌ను గుర్తుచేసుకున్నాడు హర్భజన్ సింగ్. ‘విదేశీ పిచ్‌లపై ఆడే టెస్టుల్లో కుల్దీప్ యాదవ్ మా ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్’ అని సిడ్నీ టెస్టు తర్వాత కామెంట్ చేశాడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి.

ఆ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్... ఆ తర్వాత పెద్దగా క్రికెట్ ఆడలేదు. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు కూడా రాలేదు... మరి ఆసీస్ టూర్‌లో రవిశాస్త్రి తన మాట మీద నిలబడతాడా? అంటూ ప్రశ్నించాడు హర్భజన్ సింగ్.

‘ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ కుల్దీప్ యాదవ్‌కి పెద్దగా ఛాన్సులు రాలేదు. దేశవాళీ క్రికెట్లో పర్ఫామెన్స్ ఆధారంగా అతనికి ఆసీస్ టూర్‌లో అవకాశం వచ్చింది. అయితే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి రెగ్యులర్ క్రికెట్ ఆడుతున్న స్పిన్నర్లను పక్కనబెట్టి కుల్దీప్ యాదవ్‌కి జట్టులో చోటు ఇస్తారని నేను అనుకోవడం లేదు... రవిశాస్త్రి అప్పుడెప్పుడో ఇచ్చిన మాటను ఇప్పుడు మరిచిపోయి ఉండొచ్చు’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్.