రోహిత్ గాయం నుంచి 70 శాతం మాత్రమే కోలుకున్నాడు, అతను చెప్పినా సరే... గంగూలీ కామెంట్!

First Published 14, Nov 2020, 4:59 PM

IPL 2020 సీజన్‌లో మిస్టరీగా మిగిలిన అంశం రోహిత్ శర్మ గాయం. రోహిత్ శర్మ తాను ఫిట్‌గా ఉన్నానంటూ ప్రకటించినా, లేదు... అతను కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెబుతోంది బీసీసీఐ. తాజాగా మరోసారి మీడియా సమావేశంలో రోహిత్ శర్మ గాయం గురించి ఘాటు కామెంట్లు చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

అక్టోబర్ 18న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో గాయపడ్డాడు రోహిత్ శర్మ. తొడ కండరాలు పట్టేడయంతో రెండో సూపర్ ఓవర్‌లో క్రీజులోకి కూడా రాలేదు..

ఆ తర్వాత నాలుగు మ్యాచులకి కిరన్ పోలార్డ్ కెప్టెన్సీ వహించాడు. ముంబైకి విజయాలు కూడా అందించాడు.

ఈలోపు ఆస్ట్రేలియా టూర్‌కి భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మకు చోటు కల్పించలేదు.

అయితే తాను గాయం నుంచి కోలుకున్నానంటూ రీఎంట్రీ ఇచ్చి, మూడు మ్యాచులు కూడా ఆడాడు రోహిత్ శర్మ. ఫైనల్ మ్యాచ్‌లో అయితే హాఫ్ సెంచరీ కూడా చేశాడు...

రోహిత్ శర్మ రీఎంట్రీతో నిర్ణయం మార్చుకున్న బీసీసీఐ... ఆస్ట్రేలియా టూర్‌లో జరిగే టెస్టు సిరీస్‌కి మాత్రమే అతన్ని ఎంపిక చేసింది. వన్డే, టీ20 సిరీస్‌లకు హిట్ మ్యాన్‌ను దూరంగా పెట్టింది...

గాయంతో ఉన్నవాడు హాఫ్ సెంచరీ ఎలా చేయగలడంటూ బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు రోహిత్ శర్మ అభిమానులు. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఇదే ప్రశ్న వచ్చింది.

‘రోహిత్ శర్మ ఇంకా 70 శాతం మాత్రమే ఫిట్‌గా ఉన్నాడు. కావాలంటే రోహిత్ శర్మనే అడిగి ఈ విషయం తెలుసుకోండి. అందుకే అతన్ని వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపిక చేయలేదు. టెస్టు జట్టులో మాత్రమే చేర్చాం...’ అన్నాడు సౌరవ్ గంగూలీ.

ఐపీఎల్‌లో గాయపడిన వృద్ధిమాన్ సాహా కూడా గాయంతో బాధపడుతున్నాడు. సాహా కూడా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. సాహా, రోహిత్ శర్మ ఇద్దరూ వన్డే సిరీస్ ముగిసే సమయంలో ఆస్ట్రేలియాకి బయలుదేరతారు.

‘మాకు ఆటగాళ్ల గాయాల గురించి తెలుసు. భారత క్రికెట్ జట్టు ఫిజియోకి, క్రికెట్ అకాడమీకి తెలుసు... బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఎలా పనిచేస్తుందో జనాలందరికీ తెలియదు. కానీ మాకు ఆటగాళ్ల గాయాల తీవ్రత గురించి పూర్తి అవగాహన ఉంటుంది... జనాలు గ్రౌండ్‌లో ఆటగాళ్లకి తగిలే గాయాల గురించి అర్థం చేసుకోలేరు. అందుకే ఇలా చెత్తవాగుడు వాగుతారు... ’ అంటూ ఫైర్ అయ్యాడు గంగూలీ.

గాయం పూర్తిగా తగ్గకపోయినా రోహిత్ శర్మ, ఐపీఎల్‌లో ఎందుకు పాల్గొన్నాడనేదానిపై గంగూలీ సమాధానం చెప్పలేదు. ఒక ఫ్రాంఛైజీ ఆడడం కోసం రిస్క్  చేసిన రోహిత్‌పై ఏమైనా చర్యలు ఉంటాయోమోనని భయపడుతున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్.