టీమిండియాకి గుడ్‌న్యూస్... రోహిత్ శర్మ ఫిట్! రెండో టెస్టు కోసం బంగ్లాదేశ్‌కి...
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. రెండో వన్డేలో గాయపడి జట్టుకి దూరమైన రోహిత్ శర్మ, రెండో టెస్టులో ఆడబోతున్నాడు. రెండో వన్డేలో క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ బొటనవేలికి గాయమైంది. వేలి నుంచి రక్తం కారడంతో ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లిన రోహిత్ శర్మ, టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్‌కి వచ్చాడు...
Rohit Sharma
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో గాయపడిన రోహిత్ శర్మ, దాదాపు 85 ఓవర్ల పాటు మ్యాచ్‌కి దూరమయ్యాడు... తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఓపెనర్ అనమోల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ని అందుకునే ప్రయత్నంలో రోహిత్ శర్మ చేతికి గాయమైంది...
Rohit Sharma
అప్పుడు ఫీల్డ్ వదిలిన రోహిత్, చికిత్స తర్వాత ఆసుపత్రికి వెళ్లి బొటనవేలికి స్కానింగ్ తీయించుకుని... తిరిగి వచ్చి బ్యాటింగ్ చేశాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేసి చివరి బంతి వరకూ పట్టువదలని పోరాటం ప్రదర్శించాడు హిట్ మ్యాన్...
ఆఖరి 2 బంతుల్లో టీమిండియా విజయానికి 12 పరుగులు కావాల్సి ఉండగా ఐదో బంతికి సిక్సర్ కొట్టిన రోహిత్ శర్మ, ఆఖరి బంతికి అదే సీన్ రిపీట్ చేయలేకపోయాడు. గాయానికి మెరుగైన చికిత్స తీసుకునేందుకు రెండో వన్డే అనంతరం ముంబై చేరుకున్న రోహిత్ శర్మ, పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.
తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని, రెండో టెస్టు ఆడతానని రోహిత్ శర్మ, బీసీసీఐతో చెప్పినట్టు సమాచారం... దీంతో రోహిత్ త్వరలో బంగ్లాదేశ్‌కి పయనం కాబోతున్నాడు.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొదటి రెండు వన్డేల్లో ఓడింది టీమిండియా. తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఓడి, తొలి టెస్టులోనూ పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. అయితే రోహిత్ శర్మ రీఎంట్రీతో రాహుల్ మళ్లీ వైస్ కెప్టెన్‌గా మారబోతున్నాడు...
రెండో టెస్టులో రోహిత్ శర్మ రీఎంట్రీ ఇస్తే, శుబ్‌మన్ గిల్ రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసి అవుటైన శుబ్‌మన్ గిల్, రెండో ఇన్నింగ్స్‌లో మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. డిసెంబర్ 22 నుంచి ఢాకాలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది..