వెస్టిండీస్ టెస్టు సిరీస్ ఎఫెక్ట్! ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి రోహిత్ శర్మ... అశ్విన్, జడేజాలకు..
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ భారత క్రికెటర్లకు బాగానే కలిసి వచ్చింది. ఐపీఎల్ 2023, ఆ తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఫెయిల్ అయిన రోహిత్ శర్మ, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. దీంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ, టాప్ 10లోకి ఎగబాకాడు..
తొలి టెస్టులో సెంచరీ బాదిన రోహిత్ శర్మ, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ.. టెస్టు కెరీర్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో రోహిత్ శర్మ, ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి ఎగబాకాడు..
టాప్ 10లో ఉన్న భారత బ్యాటర్ రిషబ్ పంత్, ఏడు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉండడంతో అతను 12వ స్థానానికి పడిపోయాడు. గత ఆరు నెలలుగా టీమిండియా తరుపున టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఏకైక బ్యాటర్‌గా ఉంటూ వచ్చాడు రిషబ్ పంత్. జనవరిలో టాప్ 7లో ఉన్న రిషబ్ పంత్, ప్రస్తుతం 743 పాయింట్లతో టాప్ 12లో ఉన్నాడు..
తొలి టెస్టులో 76 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రెండో టెస్టులో 121 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ పర్ఫామెన్స్‌తో విరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 14లోకి వచ్చాడు...
నాలుగు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియంసన్, 883 పాయింట్లతో టెస్టుల్లో నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతుంటే... మాంచెస్టర్ టెస్టులో సెంచరీ చేసిన మార్నస్ లబుషేన్, టాప్ 2లోకి ఎగబాకాడు..
Joe Root
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టాప్ 3లో ఉంటే, ట్రావిస్ హెడ్ టాప్ 4లో ఉన్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్ 5లో ఉంటే, స్టీవ్ స్మిత్ టాప్ 6కి పడిపోయాడు. టాప్ 7లో డార్ల్ మిచెల్, టాప్ 8లో ఉస్మాన్ ఖవాజా, టాప్ 9లో కరుణరత్నే ఉన్నారు.
Rohit Sharma
వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆరంగ్రేటం చేసిన యశస్వి జైస్వాల్, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 63వ ర్యాంకుని సాధించాడు. తొలి టెస్టులో 171 పరుగులు చేసిన జైస్వాల్, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 57, రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసి.. 466 పాయింట్లు సాధించాడు.
తొలి టెస్టులో 12 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్‌గా తన ర్యాంకుని మరింత మెరుగుపర్చుకున్నాడు. అశ్విన్ ఖాతాలో ప్రస్తుతం 879 పాయింట్లు ఉండగా రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడా 825 పాయింట్లతో ఉన్నాడు. రవీంద్ర జడేజా టాప్ 6లో ఉన్నాడు..
Virat Kohli Ravindra Jadeja
ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా టాప్ ర్యాంకు కాపాడుకున్నాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో చేసిన పరుగుల కారణంగా జడేజా 455 పాయింట్లతో టాప్2లో తన ప్లేస్ ఫిక్స్ చేసుకోగా రెండో టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన అశ్విన్, టాప్ 2లో కొనసాగుతున్నాడు. అక్షర్ పటేల్ టాప్ 5లో ఉన్నాడు..