- Home
- Sports
- Cricket
- పారిస్‌లో రోహిత్, థాయ్‌లో హార్ధిక్, ఫ్రాన్స్‌లో శుబ్‌మన్ గిల్... హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న క్రికెటర్లు..
పారిస్‌లో రోహిత్, థాయ్‌లో హార్ధిక్, ఫ్రాన్స్‌లో శుబ్‌మన్ గిల్... హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న క్రికెటర్లు..
ఐపీఎల్, ఆ తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 ముగిసిన తర్వాత టీమిండియాకి నెల రోజుల బ్రేక్ దక్కింది. గత 8 ఏళ్లలో భారత జట్టు, ఇన్ని రోజుల పాటు క్రికెట్ లేకుండా ఖాళీగా ఉండడం ఇదే మొదటిసారి..

Rohit Sharma
నెల రోజులకు పైగా బ్రేక్ దక్కడంతో భారత క్రికెటర్లు, ఫ్యామిలీస్‌తో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం పారిస్‌లో ఉన్నాడు. కూతురు సమైరా, భార్య రితికాతో కలిసి డిస్నీలాండ్‌లో గడుపుతున్నాడు రోహిత్ శర్మ...
Shubman Gill
టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ కూడా ప్రస్తుతం పారిస్‌లోనే ఉన్నాడు. ఫ్రాన్స్‌లో శుబ్‌మన్ గిల్ ఒంటరిగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఫోటోలు షేర్ చేస్తున్నా, సారా కూడా అతనితో ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు అభిమానులు..
Hardik Pandya
టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం ఫ్యామిలీతో థాయిలాండ్‌లో ఉన్నాడు. థాయిలాండ్‌లో ఫుకెట్ ఏరియాలో భార్య నటాశా, కొడుకు అగస్త్యలతో స్విమ్మింగ్ ఫూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసుకున్నాడు హార్ధిక్ పాండ్యా...
గాయం నుంచి కోలుకుని, ఐపీఎల్‌లో సీఎస్‌కే తరుపున ఆడిన దీపక్ చాహార్, ప్రస్తుతం బాలీలో భార్య జయా భరద్వాజ్‌తో సెకండ్ హానీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ తమ మొదటి వివాహ వారికోత్సవాన్ని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు..
Virat Kohli
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ఇంకా లండన్‌లోనే ఉన్నారు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత కూడా ఇంకా అక్కడే ఉండిపోయిన విరుష్క జోడి, లండన్‌లో ఓ అధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు..