MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • Rohit Sharma: రిటైర్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్న రోహిత్ శ‌ర్మ !

Rohit Sharma: రిటైర్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్న రోహిత్ శ‌ర్మ !

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన త‌ర్వాత భారత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ తీసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే,  త‌న రిటైర్మెంట్ పుకార్లను రోహిత్ తోసిపుచ్చాడు. ఇప్పుడు అదే విష‌యంపై బిగ్ అప్ డేట్ వ‌చ్చింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Mar 13 2025, 08:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma's Big Plan: ప్ర‌స్తుతం ఇండియ‌న్ క్రికెట్ లో హాట్ టాపిక్ అవుతున్న పేర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ. గ‌త కొంత కాలంగా ఈ స్టార్ సీనియ‌ర్ ప్లేయ‌ర్లు అంత‌ర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రీ ముఖ్యంగా పాకిస్తాన్, దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ముగిసిన త‌ర్వాత రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ తీసుకుంటార‌నే పుకార్లు వ్యాపించాయి.

అయితే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ ను గెలిచిన త‌ర్వాత భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న రిటైర్మెంట్ పుకార్ల‌పై స్పందించారు. తాను ఇప్పుడే క్రికెట్ కు వీడ్కోలు చెప్ప‌డం లేద‌ని స్ప‌ష్టం చేశాడు. ఇప్ప‌టికే టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రోహిత్ శ‌ర్మ.. ప్ర‌స్తుతం వ‌న్డే, టెస్టు క్రికెట్ ఆడుతున్నాడు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Rohit Sharma. (Photo- BCCI X/@BCCI)

Rohit Sharma. (Photo- BCCI X/@BCCI)

రోహిత్ శర్మ వన్డే క్రికెట్ రిటైర్మెంట్ ఎప్పుడంటే? 

త‌న రిటైర్మెంట్ పుకార్ల‌పై రోహిత్ శ‌ర్మ స్పందిస్తూ.. "నేను వ‌న్డే ఫార్మాట్ నుండి రిటైర్ కావ‌డం లేదు. నా రిటైర్మెంట్ వార్త‌లు కేవ‌లం పుకార్లు మాత్ర‌మే. అందులో నిజం లేదు. భవిష్యత్ ప్లానంటూ ఏమీ లేదు.. మున్ముందు ఏది జ‌రిగితే అది జ‌ర‌గుతుంద‌ని" కామెంట్స్ చేశాడు. దీంతో హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పుకార్లు చ‌ల్ల‌బ‌డ్డాయి. కానీ, తాజాగా మ‌రో బిగ్ అప్ డేట్ వ‌చ్చింది. 

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 గెలుచుకున్న త‌ర్వాత రోహిత్ శ‌ర్మ త‌న రిటైర్మెంట్ పై మ‌రో బిగ్ ప్లాన్ చేసుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అదే నిజ‌మైతే రోహిత్ శ‌ర్మ‌ను మ‌రో ఐసీసీ ఈవెంట్ లో కూడా చూడ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం రిటైర్మెంట్ ఆలోచ‌న లేదనీ, ఆట‌ను బాగా ఆడ‌టంపై దృష్టి ఉంద‌ని చెప్పాడు. అలాగే, 2027 ప్రపంచ కప్‌లో తాను ఆడటం లేదా ఆడ‌క‌పోవ‌డంపై ఎలాంటి ప‌క్కా ప్ర‌ణాళిక‌లు లేవు కానీ ప్ర‌స్తుతం ఆట‌ను కొన‌సాగిస్తాన‌ని చెప్పాడు.

34
India captain Rohit Sharma (Photo: X/@ICC)

India captain Rohit Sharma (Photo: X/@ICC)

అయితే, 2027 వన్డే ప్రపంచ కప్ ఆడటానికి రోహిత్ నిర్ణయం తీసుకున్నాడని క్రిక్‌బజ్ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. త‌న ప్లాన్ ప్ర‌కారం అనుకున్న అన్ని విష‌యాలు జ‌రిగితే 2027లో జ‌రిగే వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఆడిన త‌ర్వాత రిటైర్మెంట్ తీసుకుంటార‌ని సంబంధిత నివేదిక‌లు పేర్కొంటున్నాయి. రెండు నెలల్లో రోహిత్ వయసు 38 సంవత్సరాలు అవుతుంది. రాబోయే ప్రపంచ కప్ ప్రారంభం నాటికి అతనికి 40 సంవత్సరాలు వ‌స్తాయి. ఫిట్‌నెస్, బ్యాటింగ్ అప్రోచ్  కోసం అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి రోహిత్ శర్మ త‌న ప్లాన్ ను కొన‌సాగించ‌నున్నాడ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

44
Rohit Sharma

Rohit Sharma

2027 ఐసీసీ ఈవెంట్ వరకు భార‌త జ‌ట్టు వన్డే ఫార్మాట్‌లో 27 మ్యాచ్ ల‌ను ఆడుతుందని భావిస్తున్నారు. తరువాత మరిన్ని మ్యాచ్‌లను జాబితాలో చేర్చవచ్చు. మెగా టోర్నమెంట్‌కు సిద్ధం కావడానికి రోహిత్ వీటిలో పాల్గొనే అవకాశం ఉంది. భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ రోహిత్ శ‌ర్మ‌ను ప్రపంచ కప్‌కు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved