- Home
- Sports
- Cricket
- భారత కెప్టెన్లు ముంబై ఇండియన్స్‌కి! జెర్సీ నెం.18 ఆర్‌సీబీకి... ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో...
భారత కెప్టెన్లు ముంబై ఇండియన్స్‌కి! జెర్సీ నెం.18 ఆర్‌సీబీకి... ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో...
భారత మహిళా క్రికెట్ చరిత్రలో చారిత్రక ఘట్టం ముగిసింది. మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం అనుకున్నదానికంటే ఎక్కువగానే సక్సెస్ అయ్యింది. మహిళా ప్రీమియర్ లీగ్‌లో యాదృచ్ఛికమై అయినా మెన్స్ ప్రీమియర్ లీగ్‌ని పోలిన కొన్ని సంఘటనలు నమోదయ్యాయి...

ప్రస్తుత భారత పురుషుల జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ఆడుతున్నాడు. ప్రస్తుత భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడనుంది. ఈ ఇద్దరూ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి మొట్టమొదటి సెంచరీ నమోదు చేయడం విశేషం...
Image credit: PTI
అంతేకాదు రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాపై 171 పరుగులు చేస్తే, హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా సరిగ్గా ఇదే స్కోరు నమోదు చేసింది. అందులోనూ ఈ ఇద్దరూ నాటౌట్‌గా నిలవడం విశేషం. పురుషుల క్రికెట్‌లో అత్యధిక టీ20లు ఆడిన ప్లేయర్ రోహిత్ శర్మ అయితే, మహిళల క్రికెట్‌లో ఆ రికార్డు హర్మన్‌ప్రీత్ కౌర్ పేరిట ఉంది...
రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఆసియా కప్ 2018 టోర్నీ గెలిస్తే, హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో ఆసియా కప్ 2022 టోర్నీ గెలిచింది టీమిండియా. అంతేనా ఈ ఇద్దరూ ఇంగ్లాండ్‌పై టీ20ల్లో అదీ వరల్డ్ కప్ మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశారు.
పురుషుల క్రికెట్‌లో టీమిండియా తరుపున అత్యధిక సిక్సర్లు బాదింది రోహిత్ అయితే మహిళల క్రికెట్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ ఫీట్ సాధించింది. వీటన్నింటికంటే యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే హర్మన్‌ప్రీత్ కౌర్, రోహిత్ శర్మ ఇద్దరూ CEAT బ్యాట్‌నే వాడతారు...
Smriti Mandhana and Virat Kohli
అలాగే పురుషుల క్రికెట్‌లో నెంబర్ 18 జెర్సీ ధరించే విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ తరుపున ఆడుతున్నాడు. మహిళల క్రికెట్‌లో జెర్సీ నెంబర్ 18 ధరించే భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడనుంది...
Image credit: Getty
అండర్19 పురుషుల వరల్డ్ కప్ గెలిచిన భారత కెప్టెన్లు ఉన్ముక్త్ చంద్, పృథ్వీ షా, యష్ ధుల్... ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడారు. 2023 ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ షెఫాలీ వర్మ కూడా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపునే ఆడనుంది. 2008లో అండర్19 వరల్డ్ కప్ గెలిచిన విరాట్ కోహ్లీని మాత్రమే ఢిల్లీ మిస్ చేసుకుంది...