- Home
- Sports
- Cricket
- టీచర్‌గా మారిన రోహిత్ శర్మ, ఎన్‌సీఏలో యంగ్ టీమిండియాకి పాఠాలు... వడాపావ్ ఎలా తినాలో నేర్పించాలంటూ...
టీచర్‌గా మారిన రోహిత్ శర్మ, ఎన్‌సీఏలో యంగ్ టీమిండియాకి పాఠాలు... వడాపావ్ ఎలా తినాలో నేర్పించాలంటూ...
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా వైట్ బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, గాయం కారణంగా సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడు. ప్రస్తుతం ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్న రోహిత్, టీచర్ అవతారం ఎత్తాడు...

ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్ 2022 టోర్నీకి ఎంపికైన భారత యువ జట్టు, ప్రస్తుతం ఎన్‌సీఏలో భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రాటుతేలుతోంది...
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి దూరమైన రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ప్రస్తుతం ఎన్‌సీఏలో తిరిగి ఫిట్‌నెస్ అందుకునేందుకు శిక్షణ తీసుకుంటున్నారు...
ఈ సందర్భంగా భారత వైట్ బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ, అండర్-19 యువ జట్టుకి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చాడు. కుర్రాళ్లు అడిగిన ప్రశ్నలకు తన స్టైల్‌లో సమాధానాలు చెప్పాడు...
రోహిత్ శర్మ, అండర్-19 టీమ్‌కి సలహాలు, సూచనలు ఇస్తున్న ఫోటోలను పోస్టు చేసిన బీసీసీఐ, ‘అమూల్యమైన పాఠాలు. టీమిండియా వైట్ బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ, అండర్-19 జట్టుకి తన అనుభవం నుంచి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు...’అంటూ కాప్షన్ జోడించింది...
అయితే ఈ పోస్టు కింద విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఐసీసీ టోర్నీల్లో ఏ మాత్రం మెరుగైన రికార్డు లేని రోహిత్ శర్మ, వారికేం సలహాలు ఇచ్చి ఉంటాడు? వడాపావ్ ఎలా తినాలో చెప్పాడా? అంటూ వ్యంగ్యంగా ట్వీట్స్ చేస్తున్నారు విరాట్ ఫ్యాన్స్...
టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ శర్మ, కీలక మ్యాచుల్లో ఎలా అవుట్ అవ్వాలో నేర్పించి ఉంటాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు...
స్వదేశంలో మ్యాచ్‌లకు రెడీగా ఉండే రోహిత్ శర్మ, విదేశాల్లో సిరీస్‌లకు ముందు గాయపడ్డానని తప్పుకుంటూ ఉంటాడని, అతనికి విదేశాల్లో టైటిల్ ఎలా గెలవాలో తెలుస్తుందా? అంటూ తీవ్రమైన ట్రోల్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా అండర్19 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ దగ్గర విలువైన సలహాలు, సూచనలు అందుకున్న 2018 అండర్19 టీమ్ టైటిల్ గెలిచిందని, రోహిత్‌కి అండర్19 టోర్నీలోనూ మంచి రికార్డు లేదని కామెంట్లు పెడుతున్నారు..
రోహిత్ శర్మపై కోహ్లీ ఫ్యాన్స్ ఈ స్థాయిలో ట్రోల్స్‌తో దాడికి దిగడానికి విరాట్‌ను బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయమే...
టీ20 కెప్టెన్సీ మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడని రోహిత్ శర్మ, వన్డే కెప్టెన్సీ కూడా కావాలని పట్టుబట్టాడని, అందుకే విరాట్‌ను ఆ పదవి నుంచి బలవంతంగా తప్పించిందని వార్తలు వచ్చాయి...
జనవరి 14, 2022 నుంచి వెస్టిండీస్ వేదికగా మొదలయ్యే అండర్19 వరల్డ్‌కప్ టోర్నీ, ఫిబ్రవరి 5 వరకూ జరుగుతుంది. జనవరి 15న టీమిండియా, తన తొలి మ్యాచ్ సౌతాఫ్రికాతో ఆడనుంది.