- Home
- Sports
- Cricket
- రిషబ్ పంత్‌ని కాదని ఈ వయసులో రోహిత్ శర్మకు టెస్టు కెప్టెన్సీ... బీసీసీఐ సెలక్టర్లపై తీవ్రమైన ట్రోలింగ్..
రిషబ్ పంత్‌ని కాదని ఈ వయసులో రోహిత్ శర్మకు టెస్టు కెప్టెన్సీ... బీసీసీఐ సెలక్టర్లపై తీవ్రమైన ట్రోలింగ్..
భారత జట్టు నయా టెస్టు సారథిగా రోహిత్ శర్మ నియామకం కొత్త చర్చకు దారి తీస్తోంది.35 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ, మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ భారాన్ని మోయగలడా? అనేది ఆసక్తికరంగా మారింది...

రోహిత్ శర్మకి ఎన్నో ఏళ్లుగా ఫిట్‌నెస్ సమస్యలున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడిన రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా టూర్‌లో టీ20, వన్డే సిరీస్‌తో పాటు రెండు టెస్టులకు దూరమయ్యాడు...
సౌతాఫ్రికా టూర్‌కి ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడి వన్డే, టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడు భారత నయా సారథి రోహిత్ శర్మ...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత టీ20 సారథిగా బాధ్యతలు తీసుకున్న రోహిత్, ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సారథిగా నియమించబడ్డాడు...
గాయం కారణంగా సఫారీ టూర్‌కి దూరమైనా వెస్టిండీస్ సిరీస్ ద్వారా వన్డే సారథిగానూ బాధ్యతలు అందుకున్నాడు. ఇప్పుడు శ్రీలంక సిరీస్‌తో టెస్టు సారథ్య బాధ్యతలు తీసుకోబోతున్నాడు...
భారత జట్టు వచ్చే ఏడాది, ఏడాదిన్నర కాలంలో ఆడబోయే టెస్టులన్నీ భారత్‌లోనే. గత ఏడాది కరోనా కారణంగా ఈ ఏడాది జూన్‌కి వాయిదా పడిన భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు ఒక్కటే విదేశంలో ఆడబోయే టెస్టు...
2019 అక్టోబర్‌లో టెస్టు ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. మూడేళ్లలో టెస్టు సారథిగా నియమించబడ్డాడు. ఈ మూడేళ్లలో అజింకా రహానే బ్యాటుతో విఫలం కావడం రోహిత్‌కి బాగా కలిసి వచ్చింది...
‘టెస్టు సారథ్య బాధ్యతలు స్వీకరించడానికి ఇప్పుడు జట్టులో రోహిత్ శర్మనే బెటర్ ఆప్షన్‌గా కనిపించాడు..’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ తరుపున లంక సిరీస్ ఆడే జట్టును ప్రకటించిన ఛీఫ్ సెలక్టర్ ఛేతన్ శర్మ...
అయితే మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉండే క్రికెటర్ ఫిట్‌గా, జట్టుకి ఎల్లవేళలా అందుబాటులో ఉండడం అత్యంత ఆవశ్యకం. ఈ విషయంలో రోహిత్‌కి మైనస్ మార్కులే పడతాయి...
35 ఏళ్ల రోహిత్ శర్మ, ఈ వయసులో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ భారాన్ని మోస్తూ, ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ భారత జట్టును కనీసం రెండేళ్లు నడిపించినా అది పెద్ద విషయమే...
అయితే ఎమ్మెస్ ధోనీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక యంగ్ ప్లేయర్‌గా ఉన్న విరాట్ కోహ్లీకి టెస్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ...
మరి ఇప్పుడు అలాంటి స్కిల్స్ చూపిస్తున్న రిషబ్ పంత్‌కి టెస్టు కెప్టెన్సీ ఎందుకు ఇవ్వలేదు? పంత్‌కి కెప్టెన్సీ కాకపోయినా వైస్ కెప్టెన్సీ అయినా ఇవ్వొచ్చుగా?
రిషబ్ పంత్‌కి టెస్టు వైస్ కెప్టెన్సీ ఇచ్చి ఉంటే, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత అతనికే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే క్లారిటీ వచ్చేది. అయితే ఇప్పుడు అది కూడా కరువైంది..
జస్ప్రిత్ బుమ్రాకి వైస్ కెప్టెన్సీ ఇవ్వడంతో రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత కెఎల్ రాహుల్‌కి టెస్టు సారథ్య బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచనే సెలక్టర్లలో ఉన్నట్టు భావిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...
అయితే వచ్చే ఏడాదిన్నర మొత్తం స్వదేశంలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా వంటి జట్లతో మ్యాచులు ఆడుతుండడంతో రోహిత్ శర్మకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు విశ్లేషకులు...