రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సాధిస్తే... ఆసక్తికర కామెంట్లు చేసిన సౌరవ్ గంగూలీ...

First Published 3, Nov 2020, 5:30 PM

IPL 2020 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. నవంబర్ 10న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ విజయవంతంగా ముగియనుంది. ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లనుంది భారత జట్టు. రెండు నెలల పాటు సాగే ఈ సుదీర్ఘ పర్యటనకు రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడం వివాదాస్పదమైంది. బీసీసీఐ రోహిత్ శర్మ ఫిట్‌గా లేడని చెబుతుంటే, ముంబై ఇండియన్స్ మాత్రం అతను ఫిట్‌గా ఉన్నాడని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడని వీడియోలు కూడా విడుదల చేస్తోంది.

బీసీసీఐ చెప్పేదానికి, ముంబై ఇండియన్స్ పెడుతున్న వీడియోలకు పొంతన కుదరకపోవడంతో అయోమయానికి గురి అవుతున్నారు ‘హిట్ మ్యాన్’ అభిమానులు...

ఆసీస్ టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో రోహిత్ శర్మ లేకపోవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీకి, రోహిత్‌‌కి మధ్య మనస్పర్థలే దీనికి కారణమంటూ ఆరోపిస్తున్నారు రోహిత్ ఫ్యాన్స్.

దీంతో ఈ విషయంపై స్వయంగా స్పందించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై పూర్తి క్లారిటీ రాలేదు... తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే ఆస్ట్రేలియా టూర్‌కి వెళతాడని స్పష్టం చేశాడు దాదా.

‘ఐపీఎల్‌లో గాయపడిన ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ గాయాలను బీసీసీఐ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇషాంత్ త్వరగా కోలుకునే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఇషాంత్ టెస్టు సిరీస్‌కి జట్టులో కలుస్తాడు...

రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధించడం చాలా అవసరం. లేదంటే ఆసీస్ టూర్‌లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అతను ఫిట్‌నెస్ సాధిస్తే మరో ఆలోచనల లేకుండా ఆసీస్ టూర్‌కి వెళతాడు...’అని చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ.

ఆస్ట్రేలియాను వారి గడ్డపై ఓడించడం అంత సులువు కాదు, వారికి మ్యాచ్ విన్నర్‌లు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆసీస్ ప్లేయర్లు ఆఖరి బంతిదాకా కసిగా ఆడతారు... అని చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ.

డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్, ఫించ్, మ్యాక్స్‌వెల్ వంటి ఆసీస్ క్రికెటర్లను అడ్డుకునే సత్తా భారత బౌలర్లకు ఉందని, ఈ ఐపీఎల్ సీజన్‌లో అది రుజువు చేశారని చెప్పాడు గంగూలీ.

నవంబర్ 10న ఐపీఎల్ ముగుస్తుండగా నవంబర్ 12న ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది భారత జట్టు. ఐపీఎల్‌కి దూరంగా ఉన్న పూజారా, హనుమ విహారి, భారత కోచ్ రవిశాస్త్రి మాత్రం ముందుగానే ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లనున్నారు.

నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్‌లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులతో పాటు నాలుగు టెస్టులు ఆడనుంది భారత జట్టు.