146ఏళ్ల నాటి రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ ..!
రెండు ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. ఈక్రమంలోనే రోహిత్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
Rohit Sharma
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వర్షం పడి మ్యాచ్ ఆగిపోతుంది అనుకున్నారు. కానీ, ఎన్ని సార్లు అవంతరాలు కలిగించినా టీమిండియా విజయానికి అత్యంత చేరువగా వచ్చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 183 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, 24 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిపి వెస్టిండీస్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది.
Rohit Sharma
కాగా, ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అరుదైన రికార్డును అందుకున్నాడు. మొదటి టెస్టు మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక రెండో టెస్టులోనూ అంతే అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. ఈక్రమంలోనే రోహిత్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
രണ്ടിലും ഫിഫ്റ്റി
టెస్టు క్రికెట్ చరిత్రలో వరసగా అత్యధిక ఇంన్నింగ్స్ లో రెండు అంకెల స్కోర్ సాధించిన ఆటగాడుగా రోహిత్ నిలవడం విశేషం. గతంలో శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్ధనే ఇలాంటి క్రెడిట్ సాధించాడు.
కాగా, ఇప్పుడు రోహిత్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 146 ఏళ్ల టెస్టు చరిత్రలో వరుసగా 30 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో రెండంకెల స్కోరు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ రోహిత్ కావడం విశేషం.
విండీస్‌తో టెస్టు సిరీస్‌లో 240 పరుగులు చేసిన రోహిత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అతడి యావరేజ్ 53.64గా ఉంది. ప్రస్తుతం భారత జట్టులో బెస్ట్ టెస్ట్ బ్యాటర్ గా కూడా రోహిత్ నిలిచాడు. అంతే కాదు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.