- Home
- Sports
- Cricket
- 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు! అప్పుడే యువీ వచ్చి... - రోహిత్ శర్మ
2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు! అప్పుడే యువీ వచ్చి... - రోహిత్ శర్మ
2007 టీ20 వరల్డ్ కప్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, 2011 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. టీమ్‌లో సెటిల్ అవ్వడానికి నాలుగేళ్లకు పైగా తీసుకున్న రోహిత్, 2013 తర్వాత స్టార్ ప్లేయర్ అయ్యాడు...

రోహిత్ శర్మను 2011 వన్డే వరల్డ్ కప్ ఆడించాలని సెలక్టర్లు, అప్పటి హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ భావించినా, టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం పియూష్ చావ్లాకే ఓటు వేశాడు. అలా రోహిత్, వన్డే ప్రపంచ కప్ గెలిచిన టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు..
‘2011 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో నా పేరు లేకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. నా రూమ్‌లో ఒంటరిగా కూర్చొని, బాధపడుతూ ఉండేవాడిని. తర్వాత ఏం చేయాలి? టీమ్‌లో మళ్లీ నాకు చోటు దక్కుతుందా? లేదా? ఏమీ అర్థమయ్యేది కాదు..
Rohit Sharma and Yuvraj Singh
అప్పుడు యువరాజ్ సింగ్ నాకు కాల్ చేశాడు. తన రూమ్‌కి రమ్మని అన్నాడు. డిన్నర్‌కి తీసుకెళ్లాడు. టీమ్‌లో చోటు దక్కకపోతే ఎలా ఉంటుందో నాకు అర్థమయ్యేలా చెప్పాడు. నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నీ కెరీర్ ఇక్కడితోనే అయిపోలేదు...
వరల్డ్ కప్ తర్వాత చాలా ఏళ్ల పాటు నువ్వు ఆడగలం. కష్టపడు, నీకు స్కిల్స్ ఉన్నాయి. కచ్ఛితంగా కమ్‌బ్యాక్ ఇవ్వగలవు. నువ్వు లేకుండా వరల్డ్ కప్ ఆడలేమని పరిస్థితిని సృష్టించుకోవాలి. అంతేకానీ ఒక్క వరల్డ్ కప్ ఆడకపోతే కెరీర్ అయిపోయిందని బాధపడకూడదని చెప్పాడు..
అప్పుడు వచ్చే వరల్డ్ కప్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో నా డ్రాయింగ్ బోర్డులో రాసుకున్నా. అనుకున్నట్టే వరల్డ్ కప్ తర్వాతే టీమ్‌లోకి కమ్‌బ్యాక్ ఇచ్చా. అప్పటి నుంచి బాగా ఆడుతున్నా. నా జీవితంలో అత్యంత క్లిష్టమైన, విలువైన క్షణాలు అవే.
యువీ భయ్యా, ఆ రోజు అలా చెప్పకపోయి ఉంటే, ఈరోజు నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహిస్తేనే భయంగా ఉంది.. నాకు తెలిసి క్రికెట్ మానేసేవాడినేమో..’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
2011 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్ శర్మ, ఆ తర్వాత 2015, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా బరిలో దిగిన రోహిత్ శర్మ, 5 సెంచరీలు బాది వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.
2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, 2022 టీ20 వరల్డ్ కప్‌కి కెప్టెన్సీ చేశాడు. రోహిత్ కెప్టెన్సీలోనే 2023 వన్డే వరల్డ్ కప్ ఆడనుంది భారత జట్టు..
2007 టీ20 వరల్డ్ కప్ ఆడి, 2023 లోనూ టీమిండియాలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క ప్లేయర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. 2011 వన్డే వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కటే ప్రస్తుతం 2023 వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్నాడు.