MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • బ్రిస్బేన్ టెస్టుకు ముందు ప్రాక్టీస్‌కు దూరంగా రోహిత్ శ‌ర్మ‌.. శుభ్‌మ‌న్ గిల్ బోల్డ్ స్టేట్‌మెంట్‌

బ్రిస్బేన్ టెస్టుకు ముందు ప్రాక్టీస్‌కు దూరంగా రోహిత్ శ‌ర్మ‌.. శుభ్‌మ‌న్ గిల్ బోల్డ్ స్టేట్‌మెంట్‌

IND vs AUS : అడిలైట్ టెస్టులో టాపార్డ‌ర్ లో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌.. బ్రిస్బేన్ టెస్టులో ఓపెనింగ్ లో వ‌స్తాడ‌ని స‌మాచారం. అయితే, మ్యాచ్ కు ముందు రోహిత్ ప్రాక్టీస్ సెష‌న్ లో క‌నిపించ‌క‌పోవ‌డం ఆందోళ‌న‌ను పెంచింది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 13 2024, 10:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Shubman Gill, Rohit Sharma

Shubman Gill, Rohit Sharma

Border Gavaskar Trophy: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా భార‌త్ ఆస్ట్రేలియాలు ఐదు మ్యాచ్ టెస్టు సిరీస్ ను ఆడుతున్నాయి. ఇప్ప‌టికే రెండు మ్యాచ్ లు జ‌ర‌గ్గా చెరో మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేశాయి. పెర్త్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో భార‌త్ భారీ విక్ట‌రీని అందుకుంది. ఆడిలైడ్ లో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్ లో ఘోరంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఒత్తిడిలోకి జారుకున్న భార‌త జ‌ట్టు రాబోయే మూడో టెస్టులో విన్నింగ్ ట్రాక్ లోకి రావాల‌ని చూస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే, ఆస్ట్రేలియా జ‌ట్టుతో కీలకమైన బ్రిస్బేన్ గ‌బ్బా టెస్టుకు ఒక రోజు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉండ‌టంతో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీనిపై భారత జాతీయ క్రికెట్ జట్టు బ్యాటింగ్ సంచలనం శుభ్‌మన్ గిల్ అధికారిక ప్రకటన విడుదల చేశాడు. అత‌ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. 

2020-21 సీజన్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత తొలిసారిగా బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టుతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 మ్యాచ్ గురించి శుభ్‌మాన్ గిల్ మాట్లాడాడు. రోహిత్ శ‌ర్మ ప్రాక్టీస్ సెష‌న్ కు రాక‌పోవ‌డం గురించి కూడా ప్ర‌స్తావించాడు. 

35

రోహిత్ శ‌ర్మ త‌గినంతగా ప్రాక్టీస్ చేశాడని తాను భావిస్తున్నాన‌ని శుభ్ మ‌న్ గిల్ పేర్కొన్నాడు. బ్రిస్బేన్ టెస్టుకు ముందు జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు భారత కెప్టెన్ రోహిత్ హాజరుకాలేదు. బదులుగా, టీమ్ మేనేజ్‌మెంట్ యంగ్ ప్లేయ‌ర్ గిల్‌ని మీడియాతో ఇంటరాక్ట్ కోసం పంపింది. 

కీలక మ్యాచ్‌కు ఒక్కరోజు ముందు హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో కనిపించలేదు. రోహిత్ శర్మ గైర్హాజరు గురించి శుభ్‌మన్ గిల్‌ను మీడియా ప్ర‌శ్నించ‌గా, రోహిత్ అప్పటికే మ్యాచ్ కోసం తగినంత ప్రాక్టీస్ చేసినట్లు వెల్లడించాడు. 

45
Image Credit: Getty Images

Image Credit: Getty Images

హిట్ మ్యాన్ మ్యాచ్ కోసం మ‌రింత తాజాగా ఉండటానికి ఐచ్ఛిక ప్రాక్టీస్ సెషన్‌ను దాటవేయాలని నిర్ణయించుకున్నాడని తెలిపాడు. "అవును, ఇది ఐచ్ఛిక ప్రాక్టీస్ సెషన్.. అతను తగినంతగా ప్రాక్టీస్ చేశాడని నేను భావిస్తున్నాను" అని భారత యంగ్ ప్లేయ‌ర్ గిల్ తెలిపాడు. 

కాగా, ప్ర‌స్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో ప‌రుగులు చేయ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నాడు. అతని చివరి 6 టెస్ట్ మ్యాచ్‌లలో బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న చాలా దారుణంగా ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లలో వ‌రుస‌గా 6, 5, 23, 8 స్కోర్‌లను నమోదు చేశాడు. ఇక న్యూజిలాండ్ సిరీస్‌లో 2, 52, 0, 8, 18, 11 స్కోర్‌లతో మ‌రోసారి విఫ‌లం అయ్యాడు. బోర్డర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో అంటే అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల‌లో 3, 6 పరుగులు మాత్ర‌మే చేసి మ‌రోసారి దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు.

55
Rohit sharma and Jaiswal

Rohit sharma and Jaiswal

కాగా, గ‌బ్బా టెస్టులో తాను మెరుగైన ప్ర‌దర్శ‌న చేయ‌డాని సిద్ధంగా.. న‌మ్మ‌కంగా ఉన్నాని గిల్ చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2020-21 భార‌త్ చారిత్రాత్మక విజయం సాధించ‌డంలో కీల‌కంగా ఉన్న ప్లేయ‌ర్ల‌లో గిల్ ఒక‌డు. మ‌ళ్లీ ఆ వేదికపై ఆడడంపై తాను ఎంతో ఆత్మ‌విశ్వాసంతో ఉన్నాన‌ని చెప్పాడు. “నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నాను. 2021 విజయం తర్వాత మళ్లీ అదే స్టేడియంలో న‌డ‌వ‌డం.. ఇక్క‌డ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తాన‌నే న‌మ్మ‌కంతో ఉన్నాన‌ని చెప్పాడు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
శుభ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Ira Aery : క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఆల్‌రౌండర్.. ఈ ముక్కుపుడక సుందరి ఎవరో తెలిస్తే షాకవుతారు !
Recommended image2
Women's T20 World Cup: టీమిండియాకు బిగ్ షాక్.. వరల్డ్ కప్ మధ్యలోనే స్టార్ ప్లేయర్ అవుట్.. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన ఆర్సీబీ బ్యూటీ !
Recommended image3
India Highest ODI Scores : పిచ్ ఏదైనా బాదుడే.. వన్డేల్లో భారత్ క్రియేట్ చేసిన మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved