రోహిత్ ఏందయ్యా ఇది..ఐసోలేషన్‌లో రోహిత్, పంత్ అండ్ కో... మూడో టెస్టు ముందు హైడ్రామా...

First Published Jan 3, 2021, 10:47 AM IST

భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, వస్తూ వస్తూ కొత్త సమస్యలను కూడా తెచ్చిపెట్టేశాడు. న్యూఇయర్ పార్టీ పేరుతో రోహిత్ శర్మతో కలిసి మరో నలుగురు యువ క్రికెటర్లు ఓ రెస్టారెంట్‌కి వెళ్లి డిన్నర్ చేశారట. కరోనా బయో సెక్యూలర్ జోన్‌కి విరుద్ధంగా జరిగిన ఈ చర్య, భారత జట్టుకి కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. రోహిత్ శర్మతో పాటు మరో నలుగురు క్రికెటర్లను ఐసోలేషన్‌కి తరలించారు...

న్యూఇయర్ పార్టీ కోసం రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీ, రిషబ్ పంత్, పృథ్వీషా... కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లి విందు ఆరగించారు...

ఈ సమయంలో భారత క్రికెటర్లను చూసిన ఓ టీమిండియా అభిమాని, వారి హోటల్ బిల్లు చెల్లించడమే కాకుండా... రిషబ్ పంత్‌ను కౌగిలించుకుని ఫోటో కూడా దిగాడు...

సదరు అభిమాని తాను బిల్లు కట్టిన ఫోటోతో పాటు భారత క్రికెెటర్లు రెస్టారెంట్‌లో కలిసి తింటున్న ఫోటో, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తీవ్ర దుమారం రేగింది...

ఆస్ట్రేలియాలో కరోనా కలకలం సృష్టిస్తున్న సమయంలో భారత క్రికెటర్లు.. ఇలా చేయడంపై ఆసీస్ మీడియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది... ఇది కరోనా నిబంధనలకు విరుద్ధం అంటూ ధ్వజమెత్తింది.

రోహిత్ అండ్ కో చేసిన పనితో టీమిండియాకి కొత్త తలనొప్పులు వచ్చాయి... ఈ క్రికెటర్లు బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకు దర్యాప్తుకి ఆదేశించాయి బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా.

అలాగే మిగిలిన భారత జట్టుతో కలవకుండా ఈ క్రికెటర్లను ఐసోలేషన్‌కి తరలించారు. మరోసారి వీరికి కరోనా టెస్టులు కూడా నిర్వహించే అవకాశం ఉంది....

ఒకవేళ కరోనా ప్రోటోకాల్‌ను అతిక్రమించి, ఈ ఐదుగురు క్రికెటర్లు బయటికి వెళ్లినట్టు తేలితే మళ్లీ 14 రోజుల క్వారంటైన్‌కి తరలించే అవకాశం ఉంటుంది...ఇలా జరిగితే జనవరి 7 నుంచి మొదలయ్యే మూడో టెస్టుకి ఈ ప్లేయర్లు అందుబాటులో ఉండరు.

వరి రెండు టెస్టుల కోసం ఆస్ట్రేలియా వచ్చిన రోహిత్ శర్మ, ఎందుకిలా? ప్రవర్తించాడనది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ప్రశ్న...

సీనియర్ మెస్ట్ క్రికెటర్ రోహిత్ శర్మ భరోసా ఇవ్వకపోతే, మిగిలిన యంగ్ క్రికెటర్లకు బయటికి వచ్చే ధైర్యం ఉండకపోవచ్చు... రోహిత్ శర్మ రాక ముందు నెలన్నరగా భారత క్రికెటర్లు బుద్ధగానే బయో బబుల్‌లో గడిపారు.

అదీకాకుండా కొన్నాళ్లుగా వింత ప్రవర్తన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐపీఎల్ 2020 సమయంలో భారత ఫిజియో రెస్టు తీసుకోవాలని సూచించినా... మళ్లీ బరిలో దిగిన రోహిత్ శర్మ, గాయం తిరగబెట్టడంతో రెండు నెలల పాటు క్రికెట్‌కి దూరమయ్యాడు...

ఇప్పుడు మళ్లీ అదే తీరు... కెప్టెన్సీ దక్కలేదనే అక్కసుతో రోహిత్ శర్మ, కావాలనే రెబల్‌లా ప్రవర్తిస్తున్నాడని అంటున్నాడు కొందరు నెటిజన్లు..

రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుబ్ మన్ గిల్... మూడో టెస్టులో కచ్ఛితంగా చోటు దక్కించేకునే ప్లేయర్లు. వీరు ప్రోటోకాల్ అతిక్రమించినట్టు రుజువైతే, మూడో టెస్టులో ఈ ముగ్గురూ బరిలో దిగే అవకాశం ఉండదు. వీరి స్థానంలో వృద్ధిమాన్ సాహా, కెఎల్ రాహుల్ బరిలో దిగాల్సి ఉంటుంది. పృథ్వీషా, శుబ్‌మన్ గిల్ ఇద్దరు ఓపెనర్లు అందుబాటులో ఉండరు.

ఇదిలాఉంటే నాలుగో టెస్టు జరుగుతున్న బ్రిస్బెన్‌లో కరోనా విపరీతంగా వ్యాపిస్తోంది. ఇక్కడ లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వం, నగరంలోకి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది.

ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభానికి ముందే 14 రోజుల క్వారంటైన్ పీరియడ్ గడిపిన భారత జట్టు, బ్రిస్బేన్‌ టెస్టుకి మళ్లీ క్వారంటైన్‌లో గడపడానికి అంగీకరించడం లేదు...

మూడో టెస్టు జరుగుతున్న సిడ్నీలో లేదా మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టు నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియాకి సూచించింది బీసీసీఐ. క్రికెట్ ఆస్ట్రేలియా దీనిపై ఇంకా స్పందించలేదు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?