మొదటి రెండు టెస్టులకు రోహిత్, ఇషాంత్ దూరం... బీసీసీఐ అధికారిక ప్రకటన...
First Published Nov 24, 2020, 1:52 PM IST
ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడిన రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ గాయం కారణంగా మొదటి రెండు టెస్టు మ్యాచులకు దూరం కానున్నారు. మొదట టెస్టు సిరీస్ మొత్తానికి రోహిత్, ఇషాంత్ దూరమయ్యారని వార్తలు వచ్చినా, నేషనల్ క్రికెట్ అకాడమీ సూచనతో లేటుగా అయినా ఆస్ట్రేలియాకి ఈ ఇద్దరినీ పంపాలని నిర్ణయించుకుంది బీసీసీఐ.

ప్రస్తుతం బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ... గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పడుతుందని అంచనా వేశారు వైద్యులు.

దీంతో టెస్టు సిరీస్ నుంచి కూడా ఈ ఇద్దరూ తప్పుకున్నట్టే అని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రోహిత్ శర్మపై బీసీసీఐ పక్షపాతం చూపిస్తోందని ట్రోల్స్ కూడా వచ్చాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?