MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Rohit Sharma: హిట్ మ్యాన్ ఉంటే గెలుపు.. లేకుంటే ఓటమి.. ఇది టీమిండియా పరిస్థితి..

Rohit Sharma: హిట్ మ్యాన్ ఉంటే గెలుపు.. లేకుంటే ఓటమి.. ఇది టీమిండియా పరిస్థితి..

ENG vs IND: టీమిండియా సారథి రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్సీ చేపట్టాక ఓటమనేదే లేకుండా ముందుకెళ్లుతున్న హిట్ మ్యాన్.. ఇంగ్లాండ్ తో తొలి టీ20లో గెలిచి  ఈ రికార్డు అందుకున్నాడు.

2 Min read
Author : Srinivas M
Published : Jul 08 2022, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: Getty

Image credit: Getty

రోహిత్ ఉంటే గెలిచినట్టు.. లేకుంటే ఓడడమే.. అన్న తీరుగా తయారైంది టీమిండియా పరిస్థితి. అతడు కెప్టెన్సీ చేపట్టినప్పట్నుంచి భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. అదే రోహిత్ లేని మ్యాచుల్లో భారత్ గెలిచింది చాలా తక్కువ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక రోహిత్ శర్మ  ఓటమనేదే లేకుండా ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ తో తొలి టీ20లో నెగ్గడం ద్వారా అతడు ఈ ఫార్మాట్ లో వరుసగా 13 మ్యాచులు గెలిచాడు. తద్వారా ఈ ఫార్మాట్ లో వరుసగా 13 మ్యాచులు గెలిచిన తొలి కెప్టెన్ గా రికార్డులకెక్కాడు.

36

గతంలో ఈ రికార్డు అఫ్ఘనిస్తాన్ మాజీ సారథి అస్గర్ అఫ్గాన్ (వరుసగా 12 విజయాలు), రొమానియా కెప్టెన్ రమేశ్ సతీషన్ (11 విజయాలు) పేరిట ఉండేది. తాజాగా రోహిత్ ఈ ఇద్దరినీ అధిగమించి నెంబర్ వన్ స్థానానికి చేరాడు. 

46

టీ20 ప్రపంచకప్ ముగిశాక కోహ్లీ పొట్టి ఫార్మాట్ బాధ్యతలు రోహిత్ కు అప్పజెప్పాడు. అప్పట్నుంచి అతడు న్యూజిలాండ్ తో 3, వెస్టిండీస్ తో 3, శ్రీలంకతో మూడు మ్యాచులలో గెలుపొందాడు. రెగ్యులర్ సారథి కాకముందు బంగ్లాదేశ్ తో (2019లో)  రెండు టీ20లలో  నెగ్గాడు. ఇక తాజాగా ఇంగ్లాండ్ తో తొలి టీ20లో నెగ్గడం ద్వారా ఓటమనేదే లేకుండా 13 మ్యాచుల్లో  గెలిచి సరికొత్త రికార్డులు సృష్టించాడు.

56

రోహిత్ పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యాక టీ20, వన్డే, టెస్టులలో  అతడు ఆడిన ఒక్క మ్యాచ్ లో కూడా భారత్ ఓడలేదు. కానీ అతడి గైర్హాజరీలో భారత్ (దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్, స్వదేశంలో సఫారీలతో తొలి రెండు టీ20లు, ఇంగ్లాండ్ తో ఎడ్జబాస్టన్ టెస్టులో)  తడబడుతున్నది. 

66

రోహిత్ లేకుండా దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ ఆడిన టీమిండియా.. మూడు వన్డేలలో మూడింటికీ ఓడింది.  ఆ సిరీస్ కు కెఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ తర్వాత ఇటీవలే అదే సఫారీలు ప్రత్యర్థులుగా రిషభ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు.. తొలి రెండు టీ20లు ఓడి తర్వాత రెండింటిలో గెలిచింది. ఇక ఎడ్జబాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ తో బుమ్రా కెప్టెన్ అయినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. 

About the Author

SM
Srinivas M
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
RRR vs HEC : ఏంటిది రెడ్డిగారు.. రంగారెడ్డితో అలా చెడుగుడు ఆడేసుకున్నారు..!
Recommended image2
India vs Ireland: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఫిక్స్.. టీమ్ లో ప్లేస్ కోసం ముగ్గురు స్టార్ల మధ్య ఫైట్
Recommended image3
ICC Rankings: గిల్ ఖాతాలో అదిరిపోయే రికార్డ్.. బుమ్రా నంబర్ 1 కుర్చీ లాగేసుకున్న కీవీస్ ప్లేయర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved