MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • టీ20ల్లో రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా ఆడిస్తేనే బెటర్... దినేశ్ కార్తీక్ కామెంట్...

టీ20ల్లో రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా ఆడిస్తేనే బెటర్... దినేశ్ కార్తీక్ కామెంట్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో రిషబ్ పంత్ కంటే ఎక్కువ మ్యాచులు ఆడాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. మొదటి నాలుగు మ్యాచుల్లో మూడుసార్లు బ్యాటింగ్‌కి వచ్చిన దినేశ్ కార్తీక్, ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. సెమీ ఫైనల్ మ్యాచ్‌తో పాటు అంతకుముందు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం రిషబ్ పంత్‌కి చోటు దక్కింది... ఆ రెండింట్లో అతను ఫెయిల్ అయ్యాడు.

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 19 2022, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Image credit: Getty

Image credit: Getty

37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో చోటు దక్కించుకోవడమే చాలా పెద్ద విశేషం. అయితే అందివచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని దినేశ్ కార్తీక్ సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Image credit: PTI

Image credit: PTI

బ్యాటర్‌గానే కాకుండా ఫినిషర్‌గానూ దినేశ్ కార్తీక్ నుంచి టీమిండియా ఆశించిన మెరుపులైతే రాలేదు. దీంతో దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడినట్టే. అందరూ అనుకున్నట్టుగానే న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో దినేశ్ కార్తీక్‌కి చోటు దక్కలేదు...

38

దీంతో తిరిగి కామెంటేటర్‌గా తన పాత పొజిషన్‌కి వెళ్లిపోవాలని చూస్తున్నాడు దినేశ్ కార్తీక్. త్వరలో ఈ సీనియర్ మోస్ట్ వికెట్ కీపర్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటన వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తాజాగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పొజిషన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు దినేశ్ కార్తీక్...

48
Rishabh Pant

Rishabh Pant

‘రిషబ్ పంత్ సామర్థ్యం గురించి మనందరికీ బాగా తెలుసు. బౌలర్ ఎవ్వరైనా పంత్ ఈజీగా షాట్లు ఆడగలడు. అలాంటి ప్లేయర్‌ని పవర్ ప్లేలో వాడుకోవాలి. ఓపెనింగ్ చేయిస్తే రిషబ్ పంత్, టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీ20 ఓపెనర్‌గా మారతాడు..

58
Image credit: Getty

Image credit: Getty

అంతేకాకుండా ఓపెనింగ్ చేసిన సందర్భాల్లో రిషబ్ పంత్ స్ట్రైయిక్ రేటు కూడా బాగుంది. పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయడాన్ని పంత్ బాగా ఎంజాయ్ చేస్తాడు, బౌండరీలు బాదుతూ ఒత్తిడిని బౌలర్లపైకి నెట్టేస్తాడు...

68
Image credit: Getty

Image credit: Getty

ఓపెనర్‌గా ఆడించకపోతే రిషబ్ పంత్‌ ఏ పొజిషన్‌లో కుదురుకుంటాడో చూడాలి. సంజూ శాంసన్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు... న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో రిషబ్ పంత్ ఏ స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాడో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా...

78
Sanju Samson and Rishabh Pant

Sanju Samson and Rishabh Pant

టాపార్డర్‌లో పంత్‌ని వాడుకుంటే బెటర్. టెస్టుల్లో రిషబ్ పంత్ ప్లేస్‌కి ఢోకా లేదు. వన్డే క్రికెట్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. టీ20ల్లో మాత్రం బ్యాటింగ్ పొజిషన్ కారణంగా సరిగ్గా రాణించలేకపోతున్నాడు. ఫ్రాంఛైజీ క్రికెట్‌లో ఢిల్లీకి టాపార్డర్‌లో వస్తాడు, టీమిండియాకి మిడిల్ ఆర్డర్‌లో వస్తాడు...

88
Image credit: Getty

Image credit: Getty

రిషబ్ పంత్‌ని ప్లేయింగ్ ఎలెవన్‌లో ఓ ప్లేస్‌ ఫిక్స్ చేస్తే... కాస్త సమయం తీసుకున్నా అందులో అతను సెటిల్ అవుతాడు. సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాతో పాటు విరాట్ కోహ్లీ మరో రెండేళ్లు ఆడతాడని అనుకుంటున్నా... మరి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ పంత్‌ని ఎలా వాడతారో చూడాలి...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
రిషబ్ పంత్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved