- Home
- Sports
- Cricket
- రిషబ్ పంత్‌కి ప్రమోషన్... వెస్టిండీస్ సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా యంగ్ వికెట్ కీపర్...
రిషబ్ పంత్‌కి ప్రమోషన్... వెస్టిండీస్ సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా యంగ్ వికెట్ కీపర్...
ఐపీఎల్ 2021 సీజన్‌లో తన కెప్టెన్సీ స్కిల్స్‌తో అందర్నీ ఇంప్రెస్ చేసిన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి ప్రమోషన్ ఇచ్చింది భారత క్రికెట్ బోర్డు. కెఎల్ రాహుల్ గాయం కారణంగా విండీస్‌తో టీ20 సిరీస్‌కి దూరం కావడంతో అతని స్థానంలో రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...

కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి 16, బుధవారం నుంచి వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది...
ఈ సిరీస్ ఆరంభానికి ముందు కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ గాయం కారణంగా జట్టుకి దూరం కాగా, తాజాగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు...
కెఎల్ రాహుల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌లను విండీస్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసింది భారత క్రికెట్ బోర్డు...
సౌతాఫ్రికా టూర్‌కి ముందు భారత క్రికెట్ జట్టుకి వైస్ కెప్టెన్‌గా ఎంపికై, సఫారీలతో వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా ఎంపికైన కెఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కావడంతో రిషబ్ పంత్‌కి ప్రమోషన్ దక్కింది...
విండీస్‌తో టీ20 సిరీస్‌కి జట్టుని ప్రకటించిన సమయంలో వైస్ కెప్టెన్ లేకుండా ప్లేయర్ల లిస్టును విడుదల చేసిన బీసీసీఐ, తాజాగా రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు స్టేట్‌మెంట్ విడుదల చేసింది...
కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఏ మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయాడు. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన కెఎల్ రాహుల్‌లో కెప్టెన్సీ స్కిల్స్ శూన్యం అంటూ క్రికెట్ విశ్లేషకులు తేల్చేశారు...
కాబట్టి రిషబ్ పంత్‌ని వైస్ కెప్టెన్‌గా నియమించడం వెనకాల అతనికి ఫ్యూచర్ కెప్టెన్సీ ఇచ్చే ఆలోచన కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...
ఐపీఎల్ 2021 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు రిషబ్ పంత్...
రిషబ్ పంత్ కెప్టెన్సీలో గ్రూప్ స్టేజీలో అద్భుత విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండయన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లపై భారీ విజయాలు అందుకుంది...
విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలను రిషబ్ పంత్‌కి అప్పగించాలని భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు..