- Home
- Sports
- Cricket
- ఇలాగే ఆడితే రిషబ్ పంత్ టెస్టులకు మాత్రమే పనికొస్తాడు... భారత మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు...
ఇలాగే ఆడితే రిషబ్ పంత్ టెస్టులకు మాత్రమే పనికొస్తాడు... భారత మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు...
రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ గైర్హజరీలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్... బ్యాటర్‌గా మాత్రం చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన రిషబ్ పంత్, 151.78 స్ట్రైయిక్ రేటుతో 340 పరుగులు చేశాడు, ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు...

సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 29 పరుగులు చేసిన రిషబ్ పంత్, రెండో టీ20లో 5, మూడో టీ20లో 6 పరుగులు చేశాడు. టీ20ల్లో మొత్తంగా 46 మ్యాచుల్లో కలిపి 23.32 సగటుతో 723 పరుగులు చేశాడు రిషబ్ పంత్...
‘రిషబ్ పంత్ ఫామ్ ఇప్పుడు టీమిండియాకి అతి పెద్ద సవాల్. అతను మూడు మ్యాచుల్లోనూ కలిపి 40 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి మ్యాచ్‌లో పంత్ బాగానే ఆడాడు. చేసింది తక్కువ పరుగులే అయినా వేగంగా ఆడాడు...
Image credit: PTI
రిషబ్ పంత్ టీ20 పర్ఫామెన్స్ సరిగా లేకపోతే అతను పొట్టి ఫార్మాట్‌లో కొనసాగడం కష్టం. అతను టెస్టుల్లో క్లాస్ ప్లేయర్. టీ20ల్లో మాత్రం రిషబ్ పంత్ పర్ఫామెన్స్ దిగజారుతూనే ఉంది...
Image credit: PTI
కెఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని జట్టుకి అందుబాటులో వస్తే రిషబ్ పంత్, టీమ్‌లో చోటు దక్కించుకోవడం కష్టమే. ఇషాన్ కిషన్ రూపంలో మరో వికెట్ కీపర్, టీమ్‌కి అందుబాటులో ఉన్నాడు...
Image credit: PTI
అతను నిలకడగా పరుగులు చేస్తూ అదరగొడుతున్నాడు. ఇలాగే కొనసాగితే రిషబ్ పంత్ కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
Image credit: PTI
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మొదటి మూడు మ్యాచుల్లో కలిపి 40 పరుగులు మాత్రమే చేయగలిగాడు రిషబ్ పంత్. ఈ సిరీస్‌లో రిషబ్ పంత్ సగటు 13.33 మాత్రమే ఉండగా, స్ట్రైయిక్ రేటు 129.03 గా ఉంది...