- Home
- Sports
- Cricket
- ప్రయోగాలతో టీమ్‌ని చెడగొడుతున్నారు, రిషబ్ పంత్‌తో ఓపెనింగ్ చేయిస్తే... కెఎల్ రాహుల్ సంగతేంటి...
ప్రయోగాలతో టీమ్‌ని చెడగొడుతున్నారు, రిషబ్ పంత్‌తో ఓపెనింగ్ చేయిస్తే... కెఎల్ రాహుల్ సంగతేంటి...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత, కెప్టెన్‌గా రోహిత్ శర్మ, హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియాలో సిరీస్‌కో ప్రయోగం జరుగుతోంది. 2022లో ఇప్పటికే ఏడుగురు కెప్టెన్లు మారడమే కాకుండా నాలగైదు ఓపెనింగ్ జోడీలు కూడా మారాయి...

సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్ కలిసి ఓపెనింగ్ చేస్తే... ఆ తర్వాత శ్రీలంక సిరీస్‌కి రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ కలిసి ఓపెనింగ్ వచ్చారు. సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ కలిసి ఓపెనింగ్ చేశారు...
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి దీపక్ హుడా ఓపెనింగ్ చేయగా ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మతో కలిసి యంగ్ ఓపెనర్ రిషబ్ పంత్ ఓపెనర్‌గా వచ్చాడు..
‘రిషబ్ పంత్‌ని టాపార్డర్‌లో ఆడించాలని అనుకోవడం మంచిదే. అయితే అతను లోయర్ ఆర్డర్‌లో అత్యంత ప్రమాదకర ఆటగాడు. ఎవ్వరైనా ఓపెనర్ కాగలరు. అదేమీ పెద్ద విషయం కాదు...
ఐసీసీ టాప్ 10 ర్యాంకింగ్స్‌లో 9 మంది ఓపెనర్లే ఉంటారు. అయితే అస్సలు మ్యాచ్ ఆరంభమయ్యేది లోయర్ ఆర్డర్‌లోనే. నా దృష్టిలో టాపార్డర్‌లో వచ్చి టాపార్డర్‌లో వచ్చి చేసిన 40 పరుగుల కంటే లోయర్ ఆర్డర్‌లో వచ్చి శ్రేయాస్ అయ్యర్ కొట్టి 28 పరుగులే అత్యంత విలువైనవి...
రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా మారిస్తే, కెఎల్ రాహుల్ కోలుకున్నాక అతని ఏ ప్లేస్‌లో ఆడిస్తారు. రిషబ్ పంత్‌ని లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్‌గా వదిలివేయడమే సరైన పని...
Image credit: PTI
టీమిండియా అనవసర ప్రయోగాలు చేయకపోతే సిరీస్‌ని 3-0 తేడాతో గెలిచేవాళ్లు. టీమ్‌లో మార్పులు చేస్తూ ఉంటే జట్టు సమతౌల్యం దెబ్బతింటుంది.
కొన్ని మ్యాచుల్లో విరాట్ కోహ్లీ సబ్‌స్టిట్యూట్‌గా, మరికొన్ని సార్లు రోహిత్ శర్మ సబ్‌స్టిట్యూట్‌గా ప్లేయర్లను ఆడిస్తున్నారు.. ఈ ఇద్దరి చూట్టూ టీమ్‌ని నిర్మించాలనే ఆలోచన ఏ మాత్రం కరెక్ట్ కాదు... ’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్...