రిషబ్ పంత్ ఖాతాలో మరో రికార్డు... రివ్యూలు వృథా చేసుకున్న ఆస్ట్రేలియా...

First Published Jan 9, 2021, 7:20 AM IST

సిడ్నీ టెస్టులో మూడో రోజు మొదటి సెషన్‌లో ఇరు జట్లు ఆధిక్యం కనబర్చాయి. ఆసీస్ రెండు వికెట్లు తీయగా భారత జట్టు 84 పరుగులు జోడించింది. భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌, ఆస్ట్రేలియాపై రికార్డు ఫీట్ నమోదుచేయగా... అనవసరంగా రివ్యూలు తీసుకున్న ఆసీస్ మొదటి సెషన్‌లో రెండు రివ్యూలు కోల్పోయింది...

ఓవర్‌నైట్ స్కోరు 96/2 వద్ద మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా... 117 పరుగుల వద్ద రహానే వికెట్ కోల్పోయింది...

70 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన అజింకా రహానే... ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...

ఆ తర్వాత ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారి కలిసి 13 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, 25 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

మొదటి 101 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసిన ఛతేశ్వర్ పూజారా, ఆ తర్వాత మూడు బంతుల్లో రెండు బౌండరీలు బాదాడు...

38 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసిన హనుమ విహారి, లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. హజల్‌వుడ్ డైరెక్ట్ త్రో కారణంగా పెవిలియన్ చేరాడు విహారి...

ఆ తర్వాత రిషబ్ పంత్, ఛతేశ్వర్ పూజారా కలిసి లంచ్ సమయానికి 70 బంతుల్లో 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

45 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో వరుసగా 9 సార్లు 25+ స్కోర్లు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

వాలీ హమ్మండ్, రుసి సుర్టి, వీవ్ రిచర్డ్స్ 8 ఇన్నింగ్స్‌ల్లో 25+ స్కోరు చేయగా, 23 ఏళ్ల రిషబ్ పంత్ ఆ రికార్డును అధిగమించాడు...

నాథన్ లియాన్ బౌలింగ్‌లో టెస్టుల్లో 999 బంతులను ఎదుర్కొన్నాడు ఛతేశ్వర్ పూజారా... కుమార సంగర్కర - సయ్యద్ అజ్మల్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న 1224 బంతుల రికార్డు తర్వాత ఇదే అత్యధికం...

144 బంతుల్లో 4 ఫోర్లతో 42 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారాను అవుట్ చేసేందుకు రెండు సార్లు రివ్యూ తీసుకుంది ఆస్ట్రేలియా... అయితే రెండుసార్లు కూడా ఆసీస్‌కి వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో రివ్యూలు కోల్పోవాల్సి వచ్చింది.

లంచ్ సమయానికి 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది టీమిండియా. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 158 పరుగుల దూరంలో ఉంది భారత జట్టు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?