- Home
- Sports
- Cricket
- అతను ఆడితే మనదే వరల్డ్ కప్! ఆడకపోతే మాత్రం ఈసారి కూడా కష్టమే... - కృష్ణమాచారి శ్రీకాంత్
అతను ఆడితే మనదే వరల్డ్ కప్! ఆడకపోతే మాత్రం ఈసారి కూడా కష్టమే... - కృష్ణమాచారి శ్రీకాంత్
2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత 12 ఏళ్లకు మళ్లీ ఇండియాలో ప్రపంచ కప్ ఆడేందుకు సిద్దమవుతోంది భారత జట్టు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో 2023 వన్డే వరల్డ్ కప్ కోసం అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది భారత జట్టు..

Rishabh Pant
2022, డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, 2023 వన్డే వరల్డ్ కప్ వరకూ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు. అయితే పంత్ తాను కోలుకుంటున్న విధానాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో ఆశలు రేపుతున్నాడు..
రిషబ్ పంత్ స్థానంలో కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లను వికెట్ కీపర్లుగా వాడేందుకు టీమిండియాకి అవకాశం ఉంది. అవసరమైతే ఐపీఎల్‌లో అదరగొట్టిన జితేశ్ శర్మను కూడా టీమిండియా వికెట్ కీపర్‌గా వాడొచ్చు..
అయితే ఎందరు వచ్చినా, టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఎందరున్నా... రిషబ్ పంత్ టీమ్‌లో లేకపోతే భారత జట్టు వరల్డ్ కప్ గెలవడం అసాధ్యమని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్..
‘రిషబ్ పంత్ ఫిట్‌నెస్ గురించి వాస్తవాలెంటో ఎవ్వరికీ తెలీదు. ఒకవేళ అతను ఆడితే మరో అనుమానం లేకుండా టీమిండియా, వన్డే వరల్డ్ కప్ గెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఆ సమయానికి రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుంటాడా? ఇదే అసలైన ప్రశ్న..
వరల్డ్ కప్ సమయానికి రిషబ్ పంత్ ఎంత ఫిట్‌నెస్ సాధిస్తాడో ఎవ్వరూ చెప్పలేరు. అతను వన్డే వరల్డ్ కప్ ఆడతాడో లేదో కూడా చెప్పలేం. పంత్ లేకపోతే టీమిండియా విజయావకాశాలు చాలా తగ్గిపోతాయి.. ఇషాన్ కిషన్ చాలా డేంజరస్ క్రికెటర్..
వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా సాధించిన ఇషాన్ కిషన్ సత్తా గురించి ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు లేవు. కెఎల్ రాహుల్ కూడా చాలా టాలెంటెడ్. మిడిల్ ఆర్డర్‌లో అతని అవసరం చాలా ఉంది...
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ.. ముగ్గురూ మ్యాచ్ విన్నర్లే. ముగ్గురూ ఫామ్‌లో కూడా ఉన్నారు. అయితే రిషబ్ పంత్ అసలైన ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు. ఎందుకంటే టాపార్డర్‌లో టపాటపా ఐదు వికెట్లు పడిన తర్వాత కూడా దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ని ఎలా మలుపు తిప్పాలో రిషబ్ పంత్‌కి బాగా తెలుసు...
రిషబ్ పంత్ మామూలు మ్యాచుల్లో కంటే ఒత్తిడి ఎక్కువగా ఉన్న సందర్భాల్లో బాగా ఆడతాడు. అది అతని స్పెషల్ టాలెంట్. అంతేకాకుండా వికెట్ల వెనకాల నుంచి రిషబ్ పంత్ ఇచ్చే సూచనలు, కామెంటరీ మిగిలిన ప్లేయర్లలో జోష్ నింపుతాయి.. టీమిండియా దాన్ని కూడా మిస్ అవుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్...