- Home
- Sports
- Cricket
- RIP Andrew Symonds: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన క్రికెటర్లు వీరే... 20 ఏళ్లలో ఐదుగురు...
RIP Andrew Symonds: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన క్రికెటర్లు వీరే... 20 ఏళ్లలో ఐదుగురు...
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, కామెంటేటర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మరణంలో క్రీడాలోకంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. క్వీన్స్‌లాండ్‌లోని టౌన్‌విల్లే సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గత 20 ఏళ్లల్లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐదో క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్...

Andrew symonds
46 ఏళ్ల ఆండ్రూ సైమండ్స్, ఒంటరిగా కారు నడుపుతూ వెళ్తున్న సమయంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. మార్చి నెలలో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్, థాయిలాండ్‌లో గుండెపోటుతో ప్రాణాలు విడిచిన రెండు నెలలకే సైమండ్స్ ఇలా తుదిశ్వాస విడవడం క్రికెట్ ఆస్ట్రేలియాని కలిచివేస్తోంది...
బెన్ హోల్లిక్: 1977లో జన్మించిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ హోల్లిక్, ఇంగ్లాండ్ టీమ్ తరుపున ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే 2002లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఆస్ట్రేలియాలో పుట్టి 1997లో ఇంగ్లాండ్ తరుపున ఎంట్రీ ఇచ్చిన హోల్లిక్, 24 ఏళ్ల వయసులో పెర్త్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
మంజ్రముల్ ఇస్లాం రాణా: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మంజ్రముల్ ఇస్లాం రాణా, అతి పిన్న వయసులో ప్రాణాలు కోల్పోయిన అంతర్జాతీయ క్రికెటర్. బంగ్లాదేశ్ తరుపున 6 టెస్టులు, 25 వన్డేలు ఆడి 2 హాఫ్ సెంచరీలతో పాటు 28 వికెట్లు తీసిన ఇస్లాం రాణా, 22 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో మరణించాడు..
రునకో మోర్టన్:వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రునకో మోర్టన్, తన కెరీర్‌లో 15 టెస్టులు, 56 వన్డేలు, 7 టీ20 మ్యాచులు ఆడాడు. ఓవరాల్‌గా 2200 పరుగులు చేసిన మోర్టన్, 2012 మార్చి 4న ట్రిడినాన్ అండ్ టోబాగోలో అతి వేగంగా కారు నడుపుతూ పోల్‌ను ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు...
ఇజ్రా ముసోలీ: వెస్టిండీస్ తరుపున 2 టెస్టులు, 9 వన్డేలు ఆడిన ముసోలీ, 13 వికెట్లు తీశాడు. 63 ఏళ్ల వయసులో ఉదయాన్నే సైక్లింగ్ చేస్తున్న ముసోలీని ఓ వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు...