- Home
- Sports
- Cricket
- కొడుకు కోట్లు సంపాదిస్తున్నా, ఇప్పటికీ సిలిండర్లు మోస్తున్న రింకూ సింగ్ తండ్రి! చెప్పినా వినకుండా...
కొడుకు కోట్లు సంపాదిస్తున్నా, ఇప్పటికీ సిలిండర్లు మోస్తున్న రింకూ సింగ్ తండ్రి! చెప్పినా వినకుండా...
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు రింకూ సింగ్. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 5 సిక్సర్లు బాది, నెవర్ బిఫోర్ ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌కి అద్భుత విజయం అందించాడు రింకూ సింగ్...

Rinku Singh
2022 సీజన్‌కి ముందు నాలుగు సీజన్లుగా ఐపీఎల్‌లో రింకూ సింగ్ ఆడింది 10 మ్యాచులే, అందులో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది 8 మ్యాచుల్లోనూ. ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలవడంతో రింకూ సింగ్ కెరీర్ గ్రాఫ్ మారిపోయింది..
Rinku Singh Father
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ఏరియాలో జన్మించిన రింకూ సింగ్, నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ర, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి సరాఫరా చేస్తూ, కుటుంబాన్ని పోషించాడు. రింకూ సింగ్ అన్న ఓ ఆటో డ్రైవర్..
ఐపీఎల్ 2022 వరకూ రింకూ సింగ్ కుటుంబం, ఎల్‌పీసీ గ్యాస్ సిలిండర్ డిస్టిబ్యూషన్ కంపెనీ క్వార్టర్స్‌లోని ఓ రెండు గదుల్లో ఉండేవాళ్లు. 9వ తరగతి ఫెయిల్ అయిన రింకూ సింగ్‌కి కెరీర్ ఆరంభంలో స్వీపర్ జాబ్ వచ్చింది. అయితే క్రికెట్‌పై ఫోకస్ పెట్టిన రింకూ సింగ్, ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు..
ఆసియా క్రీడలకు, దానికి ముందు ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో రింకూ సింగ్‌కి అవకాశం దక్కింది. దీనిపై రింకూ సింగ్ స్పందించాడు.. ‘టీమిండియా నుంచి పిలుపు రావడంతో నా తల్లిదండ్రులు, బ్రదర్స్, నా చిన్ననాటి కోచ్ మసూద్ అమినీ అందరూ సంతోషంగా ఉన్నారు..
Rinku SIngh Father
ఇది మా అందరి కల. ఐపీఎల్‌లో నాకు మంచి ప్రైజ్ వచ్చిన తర్వాత మా నాన్నని పని మానేసి రెస్ట్ తీసుకొమ్మని చెప్పాను. అయితే మా నాన్న మాత్రం వినలేదు. ఇప్పటికీ ఆయన సిలిండర్లు ఎత్తుతూనే ఉన్నారు...
ఆయనకి తన పని తాను చేసుకోవడం ఇష్టం. నేను దాన్ని అర్థం చేసుకున్నా. ఇప్పటికిప్పుడు పని మానేసి, ఇంట్లో రెస్ట్ తీసుకొమ్మంటే ఆయనకి బోర్ కొడుతుంది. ఆయనకి రెస్ట్ తీసుకోవాలని అనిపించేంత వరకూ పని చేస్తూనే ఉంటారు.. ’ అంటూ కామెంట్ చేశాడు రింకూ సింగ్..
Rinku Singh
ఐపీఎల్ 2018లో రింకూ సింగ్‌ని రూ.80 లక్షలకు కొనుగోలు చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.55 లక్షలకు తిరిగి కొనుగోలు చేసింది.. ఐపీఎల్ 2023 తర్వాత రింకూ సింగ్ కొన్ని బ్రాండ్లకు ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు..
Rinku Singh
ఐపీఎల్ 2023 సీజన్‌లో 14 మ్యాచుల్లో 59.25 సగటుతో 474 పరుగులు చేసిన రింకూ సింగ్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.