పూజారా టెస్టు కాదు, భయపడుతూ ఆడుతున్నాడు... అతని వల్లే టీమిండియా ఇలా... రికీ పాంటింగ్ కామెంట్...
First Published Jan 10, 2021, 11:50 AM IST
గత ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించి, అదరగొట్టాడు ఛతేశ్వర్ పూజారా. ఈ పర్యటనలో కూడా పూజారాపై భారీ అంచనాలున్నాయి. అయితే సిరీస్ ఆరంభానికి ముందే ఛతేశ్వర్ పూజారాను భారీ స్కోర్లు చేయకుండా అడ్డుకుంటామని చెప్పిన ఆసీస్ టైం... అందులో విజయం సాధించింది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు.

‘మోడ్రన్ వాల్’గా గుర్తింపు పొందిన ఛతేశ్వర్ పూజారా... మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 101 బంతులు ఎదుర్కొని కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. అంటే స్టైయిక్ రేటు 16.

మరీ ఇంతలా డిఫెన్సివ్ ఆట ఆడాల్సిన అవసరం ఉందా? అనేదే ఇప్పుడు అందర్నీ కలిచివేస్తున్న ప్రశ్న... రాహుల్ ద్రావిడ్ కూడా తన కెరీర్‌లో ఇంత తక్కువ స్టైయిక్ రేటుతో పరుగులు చేయలేదు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?