- Home
- Sports
- Cricket
- భారత్ ట్రోఫీ గెలవకున్నా రికార్డులు మాత్రం బద్దలయ్యాయి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్
భారత్ ట్రోఫీ గెలవకున్నా రికార్డులు మాత్రం బద్దలయ్యాయి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్
WTC Final 2023: ఇటీవలే కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసింది. ఈ పోరులో ఆస్ట్రేలియానే విజయం వరించింది.

ఐసీసీ ఈవెంట్స్ కు అధికారిక ప్రసారదారుగా ఉన్న ‘స్టార్ స్పోర్ట్స్’ పంట పండింది. ఇటీవలే ఇంగ్లాండ్ లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో టీమిండియా ఓడినా స్టార్ వ్యూయర్‌షిప్ రేటింగ్ మాత్రం రికార్డులను బ్రేక్ చేసింది.
ఇండియా - ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ను ప్రపంచవ్యాప్తంగా 124 మిలియన్ల మంది వీక్షించినట్టు బార్క్ నివేదికలో వెల్లడైంది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక టెస్టు మ్యాచ్‌కు హయ్యస్ట్ వ్యూయర్‌షిప్ కూడా ఇదే..
డబ్ల్యూటీసీ ఫైనల్ - 2023 వ్యూయర్‌షిప్ రికార్డు 2021 డబ్ల్యూటీసీ ఫైనల్ తో పోల్చితే 32 శాతం ఎక్కువ కావడం గమనార్హం. టెస్టు క్రికెట్ ను చూసేందుకు స్టేడియాలకు జనాలు కరువైన వేళ ఫైనల్ మ్యాచ్‌కు ఊహించని స్థాయిలో వ్యూయర్‌షిప్ రావడం గమనార్హం.
ఇదే విషయమై స్టార్ స్పోర్ట్స్ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ... ‘డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారీ స్థాయిలో వ్యూయర్ షిప్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మేం పడిన కష్టానికి ప్రతిఫలంగా భావిస్తున్నాం. స్టార్ స్పోర్ట్స్ మార్కెటింగ్ స్కిల్స్, క్వాలిటీకి కాంప్రమైజ్ కాకుండా మేం అందించిన ప్రసారాలు, అధునాతన సాంకేతికత, అన్నింటికీ మించి దేశంలో క్రికెట్ మీద ఉన్న అభిమానం ఈ రికార్డు సాధించేందుకు దోహదం చేసింది..’అని చెప్పాడు.
2018 నుంచి బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంటున్న స్టార్.. 2022 ఐపీఎల్ వరకూ టీవీ, డిజిటల్ రైట్స్ పొందింది. కానీ ఈ ఏడాది డిజిటల్ రైట్స్ ను జియో దక్కించుకోగా టెలివిజన్ రైట్స్ మాత్రమే స్టార్ వద్ద ఉన్నాయి. మొబైల్స్ లో జియో ఉచితంగా ఐపీఎల్ ప్రసారాలు అందించినా ఆ పోటీని తట్టుకుని మరీ టెలివిజన్ వ్యూయర్స్ ను కాపాడుకుంది స్టార్..
ఇక ఐసీసీ తో పాటు ఆసియా కప్ కు కూడా స్టార్ స్పోర్ట్స్ అఫిషియల్ బ్రాడ్‌కాస్టర్ గా ఉంది. రాబోయే మూడు నెలలలో ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ కూడా స్టార్ తో పాటు డిజిటల్ లో హాట్ స్టార్ లోనే ప్రత్యక్ష ప్రసారం కానున్న నేపథ్యంలో వ్యూయర్‌షిప్ రికార్డుల విషయంలో కొత్త రికార్డులు నమోదుకావొచ్చు.