జస్ప్రిత్ బుమ్రా సడెన్‌గా లీవ్ తీసుకోవడానికి కారణం ఇదేనా... కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ వైరల్...
ఇంగ్లాండ్‌తో మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టు నుంచి తనను తప్పించాల్సిందిగా బీసీసీఐను జస్ప్రిత్ బుమ్రా విజ్ఞప్తి చేశాడనే వార్త, క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆశ్చర్యాన్ని కలిగింది. ఫిట్‌గా ఉన్న బుమ్రా, వ్యక్తిగత కారణాలతో నాలుగో టెస్టు తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకోని బుమ్రా, నాలుగో టెస్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడానికి కారణమిదేనంటూ కామెంటేటర్ హర్షా భోగ్లే వేసిన ట్వీట్ సంచలనం క్రియేట్ చేస్తోంది...
ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా... మూడో టెస్టులో గాయపడి నాలుగో టెస్టులో ఆడలేకపోయాడు. రీఎంట్రీ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో నాలుగు వికెట్లు తీశాడు. అయితే రెండో టెస్టులో బుమ్రాకి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ...
మూడో టెస్టులో బుమ్రాకి మళ్లీ అవకాశం దక్కినా... ఆ మ్యాచ్ మొత్తంలో ఈ స్టార్ పేసర్ వేసింది కేవలం ఆరు ఓవర్లు మాత్రమే. ఆరు ఓవర్లలో 19 పరుగులిచ్చి మూడు మెయిడిన్లు వేసిన బుమ్రాకి పెద్దగా బౌలింగ్ ఇవ్వలేదు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ...
ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతుండడంతో అక్షర్ పటేల్ స్పెల్ మొదలెట్టిన తర్వాత పేసర్లకు మరో ఓవర్ వేసే ఛాన్స్ దక్కలేదు. అక్షర్ పటేల్ తొలి ఇన్నింగ్స్‌లో 21.4 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు బౌలింగ్ చేశాడు...
మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు బౌలింగ్ చేశాడు... ఇంగ్లాండ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 79 ఓవర్లలో ఈ ఇద్దరే 67 ఓవర్లు బౌలింగ్ చేశారు.
100వ టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మతో పాటు బుమ్రాకి రెండో ఇన్నింగ్స్‌లో బంతిని అందించలేదు విరాట్ కోహ్లీ... ఈ కారణంగానే బుమ్రా, నాలుగో టెస్టు నుంచి రెస్టు తీసుకున్నామని అభిప్రాయపడ్డాడు హర్షా భోగ్లే...
‘బుమ్రా ఆఖరి టెస్టుకి ముందు లీవ్ తీసుకోవడానికి అసలు కారణం... తాను జట్టులో ఓ స్పేర్‌హెడ్‌గా ఉండడం ఇష్టలేకనే...’ అంటూ ట్వీట్ చేశాడు హర్షా భోగ్లే. జట్టులో ఉండీ ఉండనట్టుగా ఉండడం ఇష్టంలేకనే బుమ్రా తప్పుకున్నాడనేది హర్షా భోగ్లే ఉద్దేశం...
అయితే పరిస్థితులను అర్థం చేసుకోకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీపై బుమ్రా ఇలా అలగడం ఏ మాత్రం కరెక్టు కాదని అంటున్నారు కొందరు క్రికెట్ ఫ్యాన్స్. వాస్తవానికి భువనేశ్వర్ కుమార్ గాయపడితే తుదిజట్టులోకి వచ్చిన బుమ్రా, అద్భుతమైన బౌలింగ్‌లో టీమిండియాలో స్టార్ పేసర్‌గా ఎదిగాడు...
భువనేశ్వర్ కుమార్ గాయాలతో సతమతమవ్వడం బుమ్రాకి మరిన్ని ఎక్కువ అవకాశాలు రావడానికి కారణమైంది. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. అతనితో పాటు సిరాజ్, నవ్‌దీప్ సైనీ, నటరాజన్ వంటి యంగ్ పేసర్లు టీమిండియాలో ప్లేస్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు...
గబ్బా టెస్టు విజయం తర్వాత టీమిండియా రిజర్వు బెంచ్‌లో ఎలాంటి ప్లేయర్లు ఉన్నారో క్రికెట్ ప్రపంచానికి అర్థమైంది. తుదిజట్టులో ప్లేస్ కోసం పోటీ పెరుగుతున్న సమయంలో బుమ్రా అలక అతనికే నష్టం తెస్తుందని అంటున్నారు అభిమానులు...