RCBvsKKR: వీకే వర్సెస్ డీకే... గెలిచేదెవరు?
IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళరుతో తలబడుతోంది కోల్కత్తా నైట్‌రైడర్స్. తొలి రౌండ్ మ్యాచుల్లో ఇదే ఆఖరిది. ఇకపై తలబడిన జట్లే మళ్లీ సెకండ్ రౌండ్లో ఫ్లేఆఫ్స్ బరిలో నిలిచేందుకు పోటీ పడబోతున్నాయి. దాంతో నేటి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటిదాకా ఆర్సీబీ, కేకేఆర్ మధ్య 24 మ్యాచులు జరిగాయి.
కోల్కత్తా నైట్‌రైడర్స్ 14 మ్యాచుల్లో గెలవగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి 10 మ్యాచుల్లో విజయం దక్కింది...
ఐపీఎల్లో ఆర్సీబీ అత్యల్ప స్కోరు చేసింది కేకేఆర్‌పైనే. 2017 సీజన్లో కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయ్యింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
రెండు జట్ల మధ్య జరిగిన గత 8 మ్యాచుల్లో రెండింట్లో మాత్రమే బెంగళూరు విజయం సాధించింది. ఆరింట్లో కేకేఆర్‌కి గెలుపు దక్కింది.
కోహ్లీ వర్సెస్ దినేశ్ కార్తీక్: సీజన్ ఆరంభంలో వరుసగా ఫెయిల్ అయిన విరాట్ కోహ్లీ గత మ్యాచ్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చిన దినేశ్ కార్తీక్ కూడా గత మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ చూసే అవకాశం ఉంది.
బౌలింగ్ వర్సెస్ బ్యాటింగ్: కోల్కత్తా గత రెండు మ్యాచుల్లో స్వల్ప స్కోర్లకే నిలుపుకుని, మంచి విజయాలు అందుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం కోసం ఎక్కువగా బ్యాటింగ్ విభాగాన్ని నమ్ముకుంది.
పొజిషన్ కోసం ఫైట్: పాయింట్ల పట్టికలో కేకేఆర్,ఆర్సీబీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు నెట్ రన్‌రేట్ ఆధారంగా మూడు లేదా రెండో స్థానంలో ఉంటుంది.