దినేశ్ కార్తీక్‌తో పాటు ఆ ఇద్దరినీ రిలీజ్ చేయనున్న ఆర్‌సీబీ... దెబ్బకి రూ.27 కోట్లు పర్సులోకి...
ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ హడావుడి చేయడం, సీజన్ మొదలయ్యాక రకరకాల సెంటిమెంట్లతో కొట్టేస్తున్నాం అని హడావుడి చేయడం... ఆఖరికి నిరాశతో వచ్చేసారి చూసుకుందాం అని రాజీపడడం ఆర్‌సీబీకి బాగా అలవాటు. సీజన్ ముగియగానే ప్లేయర్లను పక్కనబెట్టడమూ ఆనవాయితీగా వస్తూ ఉంది..
ఐపీఎల్ 2020 నుంచి వరుసగా మూడు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2020, 2021 సీజన్లలో ఎలిమినేటర్ మ్యాచుల్లో ఓడింది. 2022 సీజన్‌లో ఇంకో అడుగు ముందుకు వేసి రెండో క్వాలిఫైయర్ ఆడింది. అయితే 2023 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరలేకపోయింది ఆర్‌సీబీ..
Dinesh Karthik
ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో గెలిచి ఉంటే ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ ప్లేస్‌లో ప్లేఆఫ్స్‌కి చేరి ఉండేది. వరుసగా నాలుగో సీజన్‌లోనూ ప్లేఆఫ్స్ చేరిన రికార్డు వచ్చి ఉండేది. అయితే విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా, శుబ్‌మన్ గిల్ సెంచరీతో గుజరాత్ టైటాన్స్‌ని గెలిపించడంతో ఆర్‌సీబీ... ప్లేఆఫ్స్‌కి అడుగు దూరంలో ఆగిపోయింది..
ఐపీఎల్ 2023 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన ముగ్గురు ప్లేయర్లను పక్కనబెట్టేయాలని ఫిక్స్ అయ్యిందట ఆర్‌సీబీ. అందులో ఫస్ట్ ప్లేయర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. ఐపీఎల్ 2022 మెగా వేలంలో దినేశ్ కార్తీక్‌ని రూ.5 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ఐపీఎల్ 2022 సీజన్‌లో 16 మ్యాచుల్లో 330 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, ఐపీఎల్ 2023 సీజన్‌లో 13 మ్యాచుల్లో 140 పరుగులు చేశాడు. సగటు 11.67 మాత్రమే. దీంతో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చిన దినేశ్ కార్తీక్‌ని వేలానికి విడుదల చేయాలని భావిస్తోందట ఆర్‌సీబీ..
Harshal Patel
ఐపీఎల్ 2021 సీజన్‌లో 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలిచిన హర్షల్ పటేల్‌ని 2022 మెగా వేలంలో రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. 2022 సీజన్‌లో 19 వికెట్లు తీసి పర్వాలేదనిపించిన హర్షల్ పటేల్, 2023 సీజన్‌లో 13 మ్యాచులు ఆడి 14 వికెట్లే తీశాడు. ఈ సీజన్‌లో ఏకంగా 9.66 ఎకానమీతో పరుగులు సమర్పించాడు హర్షల్..
లంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగను ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. యజ్వేంద్ర చాహాల్ కోసం రూ.7 కోట్లు పెట్టడానికి కూడా ఇష్టపడని ఆర్‌సీబీ, హసరంగకి ఇంత పెట్టి కొనుగోలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది..
ఐపీఎల్ 2022 సీజన్‌లో 26 వికెట్లు తీసి ఆకట్టుకున్న వానిందు హసరంగ, 2023 సీజన్‌లో 9 వికెట్లు మాత్రమే తీశాడు. అదీకాకుండా 8.9 ఎకానమీతో పరుగులు సమర్పించాడు. దీంతో ఈ ముగ్గురినీ వేలానికి విడుదల చేయాలని భావిస్తోందట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
Image credit: PTI
ఈ ముగ్గురినీ వేలానికి విడుదల చేస్తే ఆర్‌సీబీ పర్సులో ఏకంగా 27 కోట్ల రూపాయలు వచ్చి చేరతాయి. దీంతో యంగ్ ప్లేయర్లను, ఫారిన్ ప్లేయర్లను కొనుగోలు చేయాలని ఆలోచిస్తోందట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం. వీరితో పాటు ఐపీఎల్ 2023 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన కుర్రాళ్లు షాబజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, సుయాశ్ ప్రభుదేశాయ్‌లను కూడా వేలానికి విడుదల చేసే అవకాశం ఉంది.