రంజీ మ్యాచ్ ఆడబోతున్న రవీంద్ర జడేజా... టెస్టు ఎంట్రీకి ముందు బీసీసీఐ షరతు...
గత రెండేళ్లలో రవీంద్ర జడేజా ఆడిన మ్యాచుల కంటే గాయంతో తప్పుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ. ఆస్ట్రేలియా టూర్ 2020-21 టోర్నీలో మూడు సార్లు గాయపడిన రవీంద్ర జడేజా, ఐపీఎల్ 2022 సీజన్‌లోనూ గాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో గాయపడిన జడ్డూ, ఆసియా కప్ 2022 టోర్నీలో మరోసారి గాయపడ్డాడు...
Ravindra Jadeja Test
గాయంతో ఆరు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న రవీంద్ర జడేజా, వచ్చే నెలలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. అయితే రవీంద్ర జడేజా ఫిట్‌నెస్ నిరూపించుకున్నాకే అతను ఆడాలా? వద్దా? అనే విషయం నిర్ణయించనుంది బీసీసీఐ...
అంతేకాకుండా ఆరు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న రవీంద్ర జడేజా, ఫామ్ నిరూపించుకునేందుకు రంజీ ట్రోఫీలో ఆడాల్సిందిగా సూచించింది భారత క్రికెట్ బోర్డు. జనవరి 24న తమిళనాడుతో జరిగే మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరుపున బరిలో దిగబోతున్నాడు రవీంద్ర జడేజా...
పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయిన అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా.. తిరిగి రంజీ ట్రోఫీలో ఆడి ఫామ్ నిరూపించుకున్నాకే టీమ్‌లో చోటు ఉంటుందని తేల్చి చెప్పారు అప్పటి సెలక్టర్లు. ఈ ఇద్దరూ రంజీ ట్రోఫీలో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు...
Rahane-Pujara
అయితే ఛతేశ్వర్ పూజారా, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో రికార్డు లెవెల్లో పరుగుల ప్రవాహం సృష్టించాడు. 8 మ్యాచుల్లో వెయ్యికి పైగా పరుగులు చేసి భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నాడు. అజింకా రహానే మాత్రం తిరిగి టీమిండియాలోకి రాలేదు...
గాయం వంకతో బంగ్లాదేశ్ టూర్‌కి దూరమైన రవీంద్ర జడేజా, భార్య ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడు. భార్య రివాబా ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నాక సక్సెస్ సెలబ్రేషన్స్‌లోనూ జడేజా హడావుడి కనిపించింది. ఎట్టకేలకు ఎన్నికల జోరు ముగిసిన తర్వాత ఎన్‌సీఏకి చేరుకున్నాడు రవీంద్ర జడేజా...
Image credit: PTI
34 ఏళ్ల రవీంద్ర జడేజా తరుచూ గాయపడుతూ జట్టుకి దూరం అవుతుండడంతో అతని ప్లేస్‌లో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను ఆడిస్తోంది భారత జట్టు. అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్‌గా నిరూపించుకోవడంతో వైట్ బాల్ క్రికెట్‌లో జడేజాకి తిరిగి చోటు దక్కుతుందా? లేదా? అనేది అనుమానంగానే మారింది..