పంత్ ఓకే కానీ జడ్డూ అవుట్... గాయంతో టెస్టు సిరీస్‌కు దూరమైన రవీంద్ర జడేజా...
ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు కష్టాలు ఇప్పట్లో తప్పలే కనిపించడం లేదు. మొదటి టెస్టులో మహ్మద్ షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ గాయపడి టెస్టు సిరీస్‌కి దూరం కాగా... మూడో టెస్టులో గాయపడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పుడు వారి జాబితాలో చేరాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వేగంగా దూసుకొచ్చిన బంతి, రవీంద్ర జడేజా ఎడమ చేతి బొటిన వేలుకి బలంగా తగిలింది.

వేలికి టేప్ వేసుకుని బ్యాటింగ్ కొనసాగించిన జడ్డూ, ఆ తర్వాత కాసేపు ఫీల్డింగ్‌కి కాలేదు. కొద్దిసేపటి తర్వాత ఫీల్డింగ్‌కి వచ్చినా మళ్లీ రక్తస్రావం కావడంతో అతన్ని స్కానింగ్ కోసం తరలించింది బీసీసీఐ.

రవీంద్ర జడేజా వేలికి ఫ్రాక్చర్ అయ్యిందని, కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని సమాచారం.

దీంతో సిడ్నీతో పాటు ఆఖరి టెస్టుకి దూరం కానున్నాడు రవీంద్ర జడేజా. ఇది టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపనుంది.

బాక్సింగ్ డే టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన జడేజా, మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు.

బ్యాటుతోనూ రాణించి 37 బంతుల్లో 28 పరుగులు చేసి ఆసీస్ ఆధిక్యాన్ని 100 లోపు తగ్గించాడు. ఫీల్డింగ్‌లోనూ మెరుపు రనౌట్లు చేయడం, అద్భుతమైన క్యాచులు అందుకోవడం జడ్డూ స్పెషాలిటీ.

మొదటి టీ20 మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రవీంద్ర జడేజా కూడా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు.

ఆ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వేగంగా దూసుకొచ్చిన బంతి, జడేజా హెల్మెట్‌కి తగిలింది. దాంతో జడ్డూ స్థానంలో చాహాల్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

మిచెల్ స్టార్క్ చేసిన గాయం కారణంగా చివరి రెండు టీ20 మ్యాచులతో పాటు మొదటి టెస్టుకి దూరమైన జడేజా, ఇప్పుడు మళ్లీ అతని బౌలింగ్‌లోనే గాయపడి మిగిలిన టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడు.

ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు ప్రదర్శన చూసి తట్టుకోలేక ఆస్ట్రేలియా బౌలర్లు కావాలనే, మనవాళ్లకు గాయమయ్యేలా బౌలింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు భారత అభిమానులు...

మరోవైపు కమ్మిన్స్ బౌలింగ్‌లో గాయపడిన రిషబ్ పంత్... నాలుగో టెస్టు సమయానికి కోలుకుంటాడని సమాచారం. అతనికి అయిన గాయం పెద్దదేమీ కాదని, వీలైతే నాలుగో ఇన్నింగ్స్‌లో పంత్ బరిలో దిగే అవకాశమూ ఉందని టాక్..