‘కాఫీ’ కప్పుతో రవీంద్ర జడేజా... వైన్ తాగడానికి ఇంకా టైం కాలేదంటూ...

First Published Dec 23, 2020, 10:47 AM IST

మొదటి టెస్టులో ఘోర పరాభవం నుంచి తేరుకోవడానికి టీమిండియా ఆపసోపాలు పడుతుంటే, గాయం కారణంగా తొలి టెస్టు ఆడలేకపోయిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఛిల్ అవుతున్నాడు. ఆడిలైడ్‌లో కాఫీ కప్పుతో పార్కుల్లో విహరిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు రవీంద్ర జడేజా. అయితే ఈ ఫోటో కారణంగా మరోసారి కోచ్ రవిశాస్త్రిపై తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది.

మొదటి టీ20 మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గాయపడిన రవీంద్ర జడేజా, రెండో ఇన్నింగ్స్‌లో బరిలో దిగలేదు...

మిచెల్ స్టార్క్ వేసిన బంతి, రవీంద్ర జడేజా హెల్మెట్‌కి బలంగా తాకింది. ఆ తర్వాత రెండు ఎదుర్కొన్న జడ్డూ, రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డ్‌లోకి రాలేదు...

అతని స్థానంలో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగిన యజ్వేంద్ర చాహాల్... ఏకంగా 3 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు...

గాయం కారణంగా కొన్నాళ్లు భారత ఫిజియో పర్యవేక్షణలో గడిపిన రవీంద్ర జడేజా, తన బర్త్ డే సెలబ్రేషన్‌కి దూరంగా ఉన్నాడు...

ఆలస్యంగా పుట్టినరోజు జరుపుకున్న రవీంద్ర జడేజా, రెండో టెస్టు సమయానికి కోలుకుని బరిలో దిగుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది టీమిండియా...

తాజాగా ఆడిలైడ్ పార్కులో సేదతీరుతున్న భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా... కాఫీ కప్పుతో ఫోటోలను ఫోజులిచ్చాడు. అయితే ఈ ఫోటోలకి అతను పెట్టిన క్యాప్షన్ ట్రోలింగ్‌కి కారణమైంది.

‘కాఫీ... బికాజ్ ఇట్స్ టూ ఎర్లీ ఫై వైన్’... (కాఫీ... ఎందుకంటే ఇంత పొద్దునే వైన్ తాగితే బాగోదు..) అనే కాప్షన్ పెట్టాడు రవీంద్ర జడేజా. దీంతో హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి తిరిగితే ఇలాగే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

మ్యాచ్ సమయంలో కూడా ఫుల్లుగా మత్తులో తూగే కోచ్ రవిశాస్త్రి శిక్షణలో ప్లేయర్లు ఇంత కంటే మెరుగ్గా ఎలా ఉంటారని... జడ్డూ చేసిన పనికి కూడా ట్రోలింగ్‌కి టార్గెట్ అయ్యాడు టీమిండియా కోచ్ శాస్త్రి.

మరికొందరేమో ‘కాఫీ విత్ కరణ్’ ఎందుకు కాదంటూ జడ్డూని ఆటపట్టిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ‘కాఫీ విత్ కరణ్ షో’లో పాల్గొన్న టీమిండియా ఆటగాళ్లు కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా... అనుచిత వ్యాఖ్యల కారణంగా నిషేధం కూడా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా టూర్‌కి రవీంద్ర జడేజాతో పాటు అతని భార్య రివా సోలంకీ కూడా వచ్చింది. వీరికి నిద్‌యానా అనే మూడేళ్ల కూతురు కూడా ఉంది.

మొదటి టెస్టులో విఫలమైన తెలుగు కుర్రాడు హనుమ విహారి స్థానంలో రవీంద్ర జడేజాను ఆడించాలని భావిస్తోంది టీమిండియా.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?