- Home
- Sports
- Cricket
- జడేజా, బుమ్రా, అయ్యర్, ఆర్పీ సింగ్, కరణ్ నాయర్, ఫ్లింటాఫ్... ఒక్కరోజు, ఆరుగురు క్రికెటర్లు...
జడేజా, బుమ్రా, అయ్యర్, ఆర్పీ సింగ్, కరణ్ నాయర్, ఫ్లింటాఫ్... ఒక్కరోజు, ఆరుగురు క్రికెటర్లు...
డిసెంబర్ 6... క్రికెట్ ప్రపంచంలో ఈ రోజుకి చాలా స్పెషాలిటీ ఉంది. ఒక రోజు ఇద్దరు క్రికెటర్లు పుట్టినరోజు ఉండొచ్చు లేదా ముగ్గురి పుట్టినరోజు ఉండొచ్చు. కానీ నేడు ఏకంగా ఆరుగురు క్రికెటర్ల పుట్టినరోజు. అలా గని వీరిలో ఎవ్వరూ సీనియర్ మోస్ట్ మాజీ క్రికెటర్లు ఎవ్వరూ లేరు. అందరూ నేటి తరానికి అంతో కొంతో పరిచయం ఉన్న క్రికెటర్లే. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న క్రికెటర్లకు శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.

జస్ప్రిత్ బుమ్రా: టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన మూడో భారత బౌలర్‌గా ఉన్న జస్ప్రిత్ బుమ్రా... అత్యంత వేగంగా 100 వన్డే వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా ఉన్న బుమ్రా, టీమిండియాకి స్టార్ బౌలర్...
రవీంద్ర జడేజా: భారత జట్టుకి, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎన్నో విజయాలు అందించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా... 4 వేల పరుగులు, 400లకు పైగా అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన రెండో భారత క్రికెటర్. కపిల్ దేవ్ మాత్రం ఇంతకుముందు ఈ ఫీట్ సాధించాడు.
శ్రేయాస్ అయ్యర్: ఐపీఎల్‌లో అతిపిన్న కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన శ్రేయాస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ను మొట్టమొదటిసారి ఫైనల్ చేర్చాడు. టీమిండియాలో నాలుగో స్థానానికి కరెక్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్న అయ్యర్, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గానూ అందర్ని ఆకట్టుకుంటున్నాడు. ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీతో ఆకట్టుకున్న అయ్యర్, సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ తనదైన ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నాడు.
కరణ్ నాయర్: భారత జట్టు తరుపున టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్ కరణ్ నాయర్. ఇంగ్లాండ్‌లో త్రిబుల్ సెంచరీతో అదరగొట్టిన కరణ్ నాయర్‌కి ఆ తర్వాత పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు సెలక్టర్లు...
ఆర్పీ సింగ్: మహేంద్ర సింగ్ ధోనీకి స్నేహితుడైన ఆర్పీ సింగ్... టీమిండియాలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా రాణించాడు. ఆడిన మొదటి టెస్టులోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన ఆర్పీ సింగ్, 2007 టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 124 అంతర్జాతీయ వికెట్లు తీశాడు రుద్ర ప్రతాప్ సింగ్.
ఆండ్రూ ఫ్లింటాఫ్: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ 43వ పుట్టినరోజు నేడు. 2007లో యువీతో మాటల యుద్ధానికి దిగి, యువరాజ్ ఆరు సిక్సర్లు సాధించడానికి పరోక్షంగా కారణమైన ఫ్లింటాఫ్, లార్డ్స్ బాల్కనీలో దాదా షర్ట్ విప్పి సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా కారణమయ్యాడు. క్రికెట్‌కి వీడ్కోలు చెప్పిన తర్వాత ప్రొఫెషనల్ బాక్సర్‌గా కూడా నిరూపించుకున్న ఫ్లింటాఫ్... ప్రస్తుతం టెలివిజన్ రంగంలో రాణిస్తున్నాడు.