- Home
- Sports
- Cricket
- రోహిత్ శర్మ ఏం చేశాడని టెస్టుల్లో ఆ పదవి... రవిచంద్రన్ అశ్విన్ దానికి పనికి రాడా...
రోహిత్ శర్మ ఏం చేశాడని టెస్టుల్లో ఆ పదవి... రవిచంద్రన్ అశ్విన్ దానికి పనికి రాడా...
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తప్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై దుమారం రేగడంతో టెస్టుల్లో అజింకా రహానే వైస్ కెప్టెన్సీ మార్పును పెద్దగా పట్టించుకోలేదెవ్వరు... అదీకాకుండా అజింకా రహానే ఘోరమైన ఫామ్ కూడా అతని వైస్ కెప్టెన్సీ పోవడానికి కారణమైంది...

మెల్‌బోర్న్ టెస్టులో కెప్టెన్‌గా సెంచరీ చేసి భారత జట్టుకి అద్భుత విజయాన్ని అందించిన అజింకా రహానే, ఆ తర్వాత ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేకపోయాడు...
గత నాలుగేళ్లలో అజింకా రహానే టెస్టు సగటు యేటికేటికీ తగ్గుతూ వస్తుండడం కూడా టీమిండియా అభిమానులను కలవరబెడుతున్న విషయం...
ఈ రెండు కారణాల వల్ల అజింకా రహానేని టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే రోహిత్ శర్మకు టెస్టు వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై అనుమానాలు రేగుతున్నాయి..
రెండేళ్ల క్రితం వరకూ టెస్టుల్లో స్థిరమైన చోటు కూడా దక్కించుకోలేకపోయిన రోహిత్ శర్మ, ఈ ఏడాది మాత్రమే సుదీర్ఘ ఫార్మాట్‌లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇచ్చాడు...
ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ, ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్‌లో సెంచరీ అందుకుని... 900+ పరుగులతో ఉన్నాడు. మరో 80+ పరుగులు చేస్తే, 10 ఏళ్ల తర్వాత టెస్టుల్లో 1000+ పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా నిలిచేవాడు...
అయితే గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ నుంచి దూరమయ్యాడు రోహిత్ శర్మ. ఇప్పుడు ఈ సిరీస్‌కి టెస్టు వైస్ కెప్టెన్ ఎవరనేదానిపై కూడా క్లారిటీ లేదు...
అయితే ఏడాదిన్నర పర్పామెన్స్‌తోనే రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ అప్పగిస్తే, కొన్నేళ్లుగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న టెస్టు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కి ఆ పదవి ఇస్తే తప్పేంటని నిలదీస్తున్నారు అభిమానులు...
81 టెస్టుల్లో 427 వికెట్లతో పాటు ఐదు సెంచరీలతో 2755 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, తనలో నాయకత్వ లక్షణాలున్నాయని ఎప్పుడూ నిరూపించుకున్నాడు కూడా...
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న అశ్విన్‌కి వైస్ కెప్టెన్సీ ఇవ్వకపోవడానికి అతను దక్షిణ భారతానికి చెందినవాడు కావడం వల్లేనంటూ ట్రోల్స్ వినిపిస్తున్నాయి...
కొన్నేళ్లుగా అటు బ్యాటుతో, ఇటు బంతితో రాణిస్తూ భారత జట్టుకి విజయాలు అందిస్తూ, అత్యధికసార్లు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన అశ్విన్, తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు కాగా, ముంబై ప్లేయర్ కావడం వల్లే రోహిత్‌కి వన్డే కెప్టెన్సీ, టెస్టు వైస్ కెప్టెన్సీ అప్పగిస్తున్నారంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియా ఏకంగా పేస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్‌కి టెస్టు పగ్గాలు అప్పగించినప్పుడు, భారత జట్టులో వైస్ కెప్టెన్సీ ఓ స్పిన్ ఆల్‌రౌండర్‌కి ఇస్తే తప్పేంటని నిలదీస్తున్నారు...
టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు రోహిత్ శర్మకు అయిన గాయం... రవిచంద్రన్ అశ్విన్‌కి వైస్ కెప్టెన్సీ ఇవ్వాలనే కొత్త డిమాండ్‌ని తెరపైకి తెచ్చినట్టైంది...