టెస్టులు ఆడాలనుకుంటే 3, 4 రోజుల్లో ఆస్ట్రేలియా రండి... రోహిత్, ఇషాంత్ శర్మలకు రవిశాస్త్రి వార్నింగ్...
First Published Nov 23, 2020, 12:08 PM IST
ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడిన భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ... ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టులకి ఎంపికైన సంగతి తెలిసిందే. నవంబర్ 27న మొదలయ్యే వన్డే సిరీస్ తర్వాత టీ20 సిరీస్... ఆ తర్వాత టెస్టు సిరీస్ ఉండడంతో మెల్లిగా ఆస్ట్రేలియా వెళ్లవచ్చని భావించారు రోహిత్, ఇషాంత్... కానీ వారికి వెంటనే ఆస్ట్రేలియాకి వచ్చేయాల్సిందిగా అల్టిమేటం జారీచేశాడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి.

రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో బాధపడుతుంటే, ఇషాంత్ శర్మ మోచేతి కండరాల గాయంతో ఇబ్బందిపడుతున్నారు... ఈ ఇద్దరూ వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా చేరుకుంటారని వార్తలు వచ్చాయి...

అయితే టెస్టు సిరీస్ ఆడాలనుకుంటే వెంటనే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాలని ఈ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?